రభసగా మారిన రౌడీ బేబీ సాంగ్.. ఆమె లేకుంటే అంతే సంగతంటున్న అభిమానులు..

సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ సాంగ్ గా రికార్డు సాధించిన మారి చిత్రంలోని రౌడీ బేబీ సాంగ్ తాజాగా వివాదంలో చిక్కుకుంది. చిత్ర నిర్మాణ సంస్థ ఓ కామన్ డీపీని సోషలో మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా కాంట్రవర్సీ నెలకొంది..

రభసగా మారిన రౌడీ బేబీ సాంగ్.. ఆమె లేకుంటే అంతే సంగతంటున్న అభిమానులు..

Updated on: Nov 20, 2020 | 12:01 PM

సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ సాంగ్ గా రికార్డు సాధించిన మారి చిత్రంలోని రౌడీ బేబీ సాంగ్ తాజాగా వివాదంలో చిక్కుకుంది. చిత్ర నిర్మాణ సంస్థ ఓ కామన్ డీపీని సోషలో మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా కాంట్రవర్సీ నెలకొంది.. ధనుష్, సాయిపల్లవి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సాంగ్ దాదాపుగా 1 బిలియన్ వ్యూస్ సాధించింది. అయితే ధనుష్ సరసన సాయిపల్లవి ఉన్నందునే ఇన్ని వ్యూస్ వచ్చాయని సాయిపల్లవి అభిమానులు అంటున్నారు.. అలాంటిది సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ డీపీలో ధనుష్ పొటోను హైలెట్ చేసి సాయిపల్లవిని సైడ్ చేశారని ఆమె అభిమానులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే ధనుష్ వల్లే ఈ సినిమాకు అంత క్రేజ్ వచ్చిందని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ డీపీ వల్ల ఇరువురి అభిమానుల మధ్య సోషల్ మీడియా కేంద్రంగా పెద్ధ వార్ నడుస్తోంది.. ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. దీనికి పుల్‌స్టాప్ పడటానికి చిత్ర నిర్మాణ సంస్థ ఏం చేస్తుందో వేచి చూడాలి..