
చాలా సినిమాల్లో కమెడియన్ గా రాణించారు నటుడు రోలర్ రఘు. పలు సినిమాల్లో కమెడియన్ గా నటించి అలరించారు రఘు. వరుసగా సినిమాలు చేసిన రఘు ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. సినిమాలతో పాటు జబర్దస్త్ లో కామెడీ చేసి మెప్పించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రఘు తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత నటన ఎలా చేయాలో నేర్చుకుంటూ వచ్చానని తెలిపారు రఘు. తన జీవితంలో రాజీవ్ కనకాల కీలక పాత్ర పోషించారని, తనను ఆదరించి, ప్రోత్సహించిన మొదటి నటుడు రాజీవ్ కనకాలేనని రోలర్ రఘు గుర్తుచేసుకున్నారు.
రాజీవ్ కనకాల ఇన్స్టిట్యూట్‌లో రాఘవ, పెద్ది రామారావు, సమీరు, హర్ష, వక్కంతం వంశీ అందరం టీమ్ అని అన్నారు. ఈ స్నేహితుల మద్దతు తన ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడిందని ఆయన అన్నారు. శివాజీ రాజా, రామ్ జగన్నాథ్ వంటి సీనియర్ల పరిచయాలు కూడా ఇన్స్టిట్యూట్ ద్వారానే పరిచయం అయ్యారని తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్‌తో తన అనుబంధం గురించి మాట్లాడుతూ.. తన తొలి సినిమా ఆది జూనియర్ ఎన్టీఆర్‌తోనేనని, అప్పటి నుంచే ఆయనతో బలమైన బంధం ఏర్పడిందని రోలర్ రఘు తెలిపారు. ఎన్టీఆర్ తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని, తన శరీరంలో ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు ఎలా ఉంటాయో, అలాగే ఎన్టీఆర్ కూడా తనలో ఒక అవయవం వంటి వారని రఘు అన్నారు.
ఎన్టీఆర్ కోసం తన ప్రాణాలైనా ఇస్తానని చెప్పడం కంటే, ఎవరైనా ఆయనను ఇబ్బంది పెడితే, ముందు తనను ఎదుర్కోవాలని సవాలు చేసేంతటి అభిమానం తనకు ఉందని అన్నారు. ఇద్దరి మధ్య ఒక ప్రత్యేక అనుబంధం ఉందని, అది మాటల్లో చెప్పలేనిదని అన్నారు. ఎన్టీఆర్ తమతో ఉన్న ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్నారు. ఇప్పటికీ తను ఎన్టీఆర్‌ను ఎప్పుడూ అన్న, పెద్దన్న, నాన్న అని మాత్రమే పిలుస్తానని రోలర్ రఘు అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.