
తెలుగు సినిమా ప్రపంచంలో తమదైన నటనతో అలరించిన హాస్యనటులలో పద్మనాభం ఒకరు. తెరపై తనదైన నటన, చిలిపితనంతో ప్రేక్షకులను అలరించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ రాణించి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించి నిర్మాణ రంగంలోనూ సక్సెస్ అయ్యారు. అలాగే హీరోగాను మెప్పించారు. సినీరంగంలో స్టార్ డమ్ సంపాదించుకుని.. తన నటనతో ఇండస్ట్రీలో తనదైన ముద్రవేశారు. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. ఉన్నత శిఖరాలకు చేరినప్పటికీ ఊహించని విధంగా జీవితంలో కష్టాలు ఎదురవుతుంటాయి. ఎంతటి స్టార్ హోదా అనుభవించారో చివరి రోజుల్లో అంత పేదరికంలో బతికారు. చిన్నతనంలో ఓ అంధుడి కంచంలో రాయివేసి అందులో ఉన్న చిల్లర డబ్బులు దొంగతనం చేశారట పద్మనాభం. పెద్దయ్యాక ఆ సంఘటన ఆయనను ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేదట. జాతకరత్న మిడతం భొట్లు చిత్రంలో మిడతంభొట్లును రాజు వద్దకు తీసుకువస్తున్నప్పుడు ఇతడు చేసిన నేరం ఏంటీ ? అని ఓ అంధుడు అడుగుతాడు. ఆ సీన్ కోసం నిజమైన అంధుడిని తీసుకువచ్చి.. షూట్ పూర్తయ్యాక అతడికి డబ్బు ఇచ్చి పంపించారు.
ఎక్కువమంది చదివినవి : Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..
అలాగే లిటిల్ ఫ్లవర్ బ్లైండ్ అండ్ డెఫ్ అనే సంస్థకు అప్పట్లో వేల రూపాయాలు విరాళంగా ఇచ్చారు. 1975లో సినిమా వైభవం అనే మూవీ కోసం ఓ వ్యక్తి వద్ద రూ.60 వేలు అప్పు చేశారట. అందుకు హామీగా దేవత, పొట్టి ప్లీడర్లు, శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న, శ్రీరామకథ సినిమాల నెగిటివ్స్ తాకట్టు పెట్టారు. గడువులోగా పద్మనాభం చేసిన అప్పు తీర్చలేకపోయారు. దీంతో ఆ సినిమాల నెగిటివ్స్ అన్ని పోగొట్టుకున్నారు. సదరు వ్యక్తి ఆ సినిమా హక్కులను రూ.2.75 లక్షలకు రాయలసీమ, ఆంధ్రా, నైజాం ఏరియాలకు అమ్మేశారు. అప్పు తీరగా, మిగతా డబ్బు పద్మనాభానికి ఇవ్వలేదు. అలాగే సినిమా నెగిటివ్స్ సైతం వాపసు ఇవ్వలేదు.
ఎక్కువమంది చదివినవి : Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ? బుల్లితెర సూపర్ స్టార్ నిరుపమ్ పరిటాల..
1983 దాకా కేసు కోర్టులో నడిచింది. కానీ పద్మనాభానికి మాత్రం న్యాయం జరగలేదు. చివరికి ఆ వ్యక్తి మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులు లక్ష రూపాయలు తీసుకుని నెగిటివ్స్ పద్మనాభానికి ఇచ్చారట. ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీ హాస్యనటుడిగా దూసుకుపోయిన ఆయన.. చివరి రోజుల్లో మాత్రం ఎంతో కష్టపడ్డారు. పద్మనాభం 2010లో ఫిబ్రవరి 10న కన్నుమూశారు.
ఎక్కువమంది చదివినవి : Jabardasth Sujatha: యూబ్యూబ్ నుంచి మాకు ఎన్ని కోట్లు వస్తాయంటే.. జబర్దస్త్ సుజాత కామెంట్స్ వైరల్..
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..