
‘జబర్ధస్థ్’, ‘అదిరింది’ కామెడీ షోలతో తెలుగు ప్రజలకి సుపరిచితమైన కమెడియన్ ఆర్‌పీ దర్శకునిగా మారారు. జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో ఆయన ఓ చిత్రానికి దర్శకత్వం చేయబోతున్నారు. శ్రీ పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై కోవూరు అరుణాచలం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో తాజాగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా వెండితెర, బుల్లితెర రంగాలకి చెందిన వివిధ ప్రముఖులు విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అదిరింది జడ్జ్, మెగా బ్రదర్ నాగబాబు వచ్చి టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించారు.
ఈ సందర్భంగా దర్శకుడు ఆర్‌పీ మాట్లాడుతూ..
గత కొన్నేళ్లుగా జబర్ధస్థ్ కామెడీ షో ద్వారా నన్ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకి ధన్యవాదాలు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంగా ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ కుదరడంతో దర్శకునిగా ఆడియెన్స్ ముందుకి రావడానికి నిశ్చయించుకున్నాను. నా మీద నమ్మకంతో నిర్మాత కోవూరు అరుణాచలం గారు సినిమాని నిర్మించడానికి ముందుకొచ్చారు. పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా, నా డైరక్షన్ లో తెరెకెక్కుతున్న ఈ సినిమాలో జేడీచక్రవర్తి కీలక పాత్ర పోషించడానికి అంగీకరించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో జే.డి. పాత్ర చాలా విలక్షణంగా ఉంటుంది. జే.డి.చక్రవర్తితో పాటు, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, జబర్ధస్థ్ ఆదిత్య తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో హైదరాబాద్, నెల్లూర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిపారు.
Also Read :
వైఎస్‌ఆర్ ఆసరా స్కీమ్, రుణాలపై మార్గదర్శకాలు విడుదల