AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి చేసుకోవడం కంటే ఓ కుక్కను పెంచుకోవడం బెటర్ అనిపించింది.. అంతమాట అనేసిందేంటీ..!!

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు కలర్స్ స్వాతి. బుల్లితెరపై యాంకర్‏గా మొదలైన ప్రయాణం వెండితెరపై కథానాయికగా ఆకట్టుకునేవరకు అందరికీ తెలిసిందే. ఒకప్పుడు కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా యాంకర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ షో పేరునే తన పేరుగా మార్చుకుంది.

పెళ్లి చేసుకోవడం కంటే ఓ కుక్కను పెంచుకోవడం బెటర్ అనిపించింది.. అంతమాట అనేసిందేంటీ..!!
Colors Swathi
Rajeev Rayala
|

Updated on: May 03, 2026 | 3:40 PM

Share

ప్రముఖ నటి కలర్స్ స్వాతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. యాంకర్‌గా, హీరోయిన్‌గా రాణించింది స్వాతి. గతకొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది స్వాతి. గతంలో ఓ ఇంటర్వ్యూలో కలర్ స్వాతి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి ప్రపోజల్స్ గురించి మాట్లాడుతూ, చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలను ఆకట్టుకోవడానికి పెళ్లి చేసుకుంటాను అనే పదాన్ని ఉపయోగిస్తారని, తాను హోమ్లీ గర్ల్‌గా కనిపించడం వల్ల ఇలాంటి ప్రపోజల్స్ ఎక్కువగా వచ్చాయని ఆమె తెలిపారు. అయితే, వారి మాటల్లో నిజాయితీ లేదని తాను గ్రహించానని, అందుకే నో థాంక్స్ చెప్పేదాన్నని స్వాతి తెలిపారు. తాను చూసిన అనేక వివాహ బంధాల్లోని హిపోక్రసీ, అంటే భార్యాభర్తలు పైకి ప్రేమగా కనిపించినా, లోపల చాలా సమస్యలు ఉంటాయని, చేతులు పట్టుకుని తిరుగుతూనే, ప్రైవేటుగా వేరే ఎస్ఎంఎస్‌లు పంపుకుంటూ ఉంటారని స్వాతి పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : ఆ హీరో పిలిచి తిడతాడనుకున్నా.. కానీ ఆయన చేసిన పనికి షాక్ అయ్యా

ఇలాంటివి చూసిన తర్వాత తనకు పెళ్లిపై వైరాగ్యం కలిగిందని, అప్పట్లో పెళ్లి చేసుకోవడం కన్నా ఒక కుక్కను పెంచుకుని, తన తల్లిదండ్రులు అవసరమైనంత కాలం వారిని చూసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పారు. అయితే, స్వాతి తల్లిదండ్రులు రివర్స్ సైకాలజీ ఉపయోగించి, “మీరు సంతోషంగా ఉండాలని మాకు లేదా?” అని అడగడంతో, చివరికి వారికి పెళ్లి సంబంధాలు చూడటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని స్వాతి తెలిపారు. ప్రేమ వివాహాలపై తనకు ఓపిక లేదని, ఏదైనా తప్పు జరిగితే తానే అనుభవించాల్సి వస్తుందని ఆమె అన్నారు.

ఇది కూడా చదవండి : Talluri Rameswari: నా రెమ్యునరేషన్ గురించి ఆ స్టార్ హీరో అలా అనేసరికి షాక్ అయ్యా..!

అందుకే పెద్దలు కుదిర్చిన పెళ్లి అయితే, ఏదైనా సమస్య వచ్చినా “మీరే తీసుకొచ్చారు కదా” అని వారిని అనొచ్చని, తనకు ఆ బాధ తప్పుతుందని సరదాగా తెలిపారు స్వాతి. మంచి అబ్బాయి దొరకడం అంటే అదృష్టమని, సైకోలు, అబద్ధాలు చెప్పేవాళ్లు చాలా మంది ఉంటారని, వారితో కలిసి పని చేసిన అనుభవం తనకు ఉందని స్వాతి పేర్కొన్నారు. అయితే తన తండ్రి, చిన్నాన్న వంటి వారు సంతోషంగా ఉన్నారని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Follow Us
పెళ్లి చేసుకోవడం కంటే ఓ కుక్కను పెంచుకోవడం బెటర్ అనిపించింది
పెళ్లి చేసుకోవడం కంటే ఓ కుక్కను పెంచుకోవడం బెటర్ అనిపించింది
యాదాద్రిలో భక్తులకు సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతి..!
యాదాద్రిలో భక్తులకు సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతి..!
ఆ ఉదంతంపై బీసీసీఐ ఆగ్రహం.. ఐపీఎల్ జట్లకు స్ట్రాంగ్ వార్నింగ్..!
ఆ ఉదంతంపై బీసీసీఐ ఆగ్రహం.. ఐపీఎల్ జట్లకు స్ట్రాంగ్ వార్నింగ్..!
తెలుగు సినిమా తొలి స్టార్ కమెడియన్.. 44 ఏళ్లకే ఈ లోకాన్ని వీడారు
తెలుగు సినిమా తొలి స్టార్ కమెడియన్.. 44 ఏళ్లకే ఈ లోకాన్ని వీడారు
విదేశీ బ్యాంకుల నుంచి భారత్.. బంగారాన్ని ఎందుకు వెనక్కు తెస్తోంది
విదేశీ బ్యాంకుల నుంచి భారత్.. బంగారాన్ని ఎందుకు వెనక్కు తెస్తోంది
త్వరలో.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటాయా ??
త్వరలో.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటాయా ??
త్రీ వీలర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. మైలేజీ చూస్తే ఆశ్చర్యపోతారు!
త్రీ వీలర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. మైలేజీ చూస్తే ఆశ్చర్యపోతారు!
వాహనదారులపట్ల ట్రాఫిక్‌ పోలీసుల ఉదారత.. ఏం చేశారంటే
వాహనదారులపట్ల ట్రాఫిక్‌ పోలీసుల ఉదారత.. ఏం చేశారంటే
ఏసీ వాడేవారికి బిగ్‌ అలర్ట్.. ఈ తప్పులు చేశారో..
ఏసీ వాడేవారికి బిగ్‌ అలర్ట్.. ఈ తప్పులు చేశారో..
భక్తులను వణికించిన తేనెటీగలు.. ఆరుగురి పరిస్థితి విషమం!
భక్తులను వణికించిన తేనెటీగలు.. ఆరుగురి పరిస్థితి విషమం!