స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చిపెట్టిన చిత్రం పుష్ప. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో బన్నీ ఊరమాస్ పుష్పరాజ్ పాత్రలో నటన నార్త్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా బాక్సాపీస్ రికార్డ్స్ బద్దలుకొట్టింది. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటించగా.. సమంత స్పెషల్ సాంగ్ చేసింది. అలాగే ఇందులో సునీల్, అనసూయ కీలకపాత్రలలో కనిపించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ మూవీ సెకండ్ పార్ట్ పుష్ప 2 చిత్రీకరణ జరుగుతుంది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా చిత్రీకరణ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ లీక్స్ మాత్రం ఆగడం లేదు.
పుష్ప 2 లో రష్మిక పాత్ర చనిపోతుందంటూ రూమర్స్ కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలను నిజమే అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో రష్మిక చనిపోయినట్లుగా కనిపిస్తుంది. దీంతో పుష్ప 2లో రష్మిక చనిపోతుందని.. అందుకే సెకండ్ హీరోయిన్ పాత్రను తీసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. అయితే ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్న రష్మిక ఫోటో.. పుష్ప 2 చిత్రానికి సంబంధించినది కాదు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న ఫోటో మరాఠీ చిత్రం ‘nay varan bhat loncha kon nay koncha’ చిత్రంలోనిది. అంతేకాకుండా.. అందులో కనిపిస్తున్నది సైతం రష్మిక కాదని.. మరాఠీ నటి ఆశ్విని అట. దీంతో పుష్ప 2లో రష్మిక పాత్రపై మరోసారి క్లారిటీ వచ్చేసింది.
Fake anta frnds
Rashmika ante intha hate entra ?? https://t.co/uIFab5UEGq pic.twitter.com/b1eLa21Pcz
— StylishstarAbhimani ? (@bunnyannacult22) May 19, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.