
ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమైన నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 సినిమా టికెట్ ధర ఏకంగా రూ. 5 లక్షలు పలికింది. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ రూ.5 లక్షలకు టికెట్ కొనుగోలు చేశారు. నందమూరి బాలకృష్ణ అభిమానుల సంఘం నాయకులు ఎమ్మెల్యే ను కలిసి సినిమా టికెట్ ను అందించారు. బాలకృష్ణ అభిమానిగా సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. బాలకృష్ణ అభిమానుల కోరిక మేరకు చిత్తూరు లో బాలకృష్ణ పేరుతో బస్సు షెల్టర్ నిర్మాణం, ఇతర సేవా కార్యక్రమాలకు ఈ డబ్బు ను ఖర్చు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ చిత్తూరు టౌన్ అధ్యక్షులు ఎల్.డి.నాయుడు, జిల్లా అధ్యక్షుడు మురళి నాయుడుతో పాటు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.
కాగా గురువారం (డిసెంబర్ 04) రాత్రి నుంచే అఖండ 2 ప్రీమియర్స్ స్టార్ట్ కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ప్రీమియర్స్‌ను రద్దు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రం సమస్యల్లో చిక్కుకున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ప్రస్తుతం అన్ని సమస్యలు పరిష్కారమైనట్లు సమాచారం. మరికాసేపట్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయని, శుక్రవారం ఉదయం 8 గంటల షోతో సందడి షురూ కానుంది సినిమా వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమైన నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 సినిమా టికెట్టు ను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ రూ.5 లక్షలకు కొనుగోలు చేశారు. గురువారం బాలకృష్ణ అభిమానుల సంఘం నాయకులు ఎమ్మెల్యే ను కలిసి సినిమా టికెట్టు ను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..… pic.twitter.com/uXXw6brQ93
— Gurajala Jagan Mohan (@JM_Gurajala) December 4, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.