
Chiranjeevi: రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే చాలా మంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎంతో మంది అభాగ్యులు నిరాశ్రియులయ్యారు. అయితే ఇప్పటికే అక్కడ చదువుతున్న భారత విద్యార్థులను ఇండియాకు తరలించింది మన ప్రభుత్వం. భారతీయులను ఆపరేషన్ గంగా పేరుతో కేంద్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో వెనక్కి తీసుకొచ్చింది. అయినప్పటికీ ఇప్పటికీ అక్కడ ఎంతో మంది భారతీయులు చిక్కుకుపోయారు. అయితే భారతీయ వైద్యుడు తన పెంపుడు జంతువు చిరుతలను అక్కడ ఒంటరిగా వదిలివేయడానికి ఇష్టపడకుండా వాటితోపాటే అక్కడే జీవిస్తున్నాడు. చిరంజీవి నటించిన లంకేశ్వరుడు సినిమా ప్రేరణగా తాను కూడా ఈ మూగజీవాలను పెంచుకుంటున్నట్టు ఆయన తెలిపారు. భారత రాయబార కార్యాలయ అధికారులు అతడిని భారత్ కు పంపించడానికి సిద్ధమైనా కూడా చిరుతల కోసం అక్కడే ఉంటానని వైద్యుడు తెలుపడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
దీని పై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ..’ప్రియమైన డాక్టర్ గిరికుమార్.. జాగ్వార్, పాంథర్ లపై మీకున్న ప్రేమనా హృదయాన్ని టచ్ చేసింది, నాలో స్ఫూర్తిని నింపింది. పాంథర్ మరియు జాగ్వార్‌ల సంరక్షణ కోసం ఉక్రెయిన్‌లో తిరిగి ఉండడాన్ని ఎంచుకోవడం నిజంగా సంతోషకరమైన విషయం. ఈ అద్భుతమైన జీవుల పట్ల మీ కరుణ మరియు ప్రేమ చాలా ప్రశంసనీయం. ఉక్రెయిన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో కూడా ఇండియాకు రాకుండా, వాటి కోసం అక్కడే ఉండాలనుకోవడం నిజంగా హృదయాన్ని హత్తుకునే విషయం. ఈ సమయంలో మీరు అక్కడ దయచేసి సురక్షితంగా ఉండండి అలాగే మీ పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూసుకోండి. గాడ్ బ్లెస్! – చిరంజీవి ఎన్ని ట్వీట్ చేశారు.
#TeluguDoctor #UkraineWar #Jaguar #Panther #compassion #petlovers https://t.co/XqyUT6ebbN pic.twitter.com/balOzxRj26
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 10, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :