Chiranjeevi: ఆచార్య సినిమా కోసం పెద్దమొత్తంలో వదులుకున్న.. కేవలం వారికోసమే..! అదే నా ధర్మం

|

Oct 13, 2022 | 7:09 PM

మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ లూసీఫర్ సినిమాకు రీమేక్ గా వచ్చింది. ఈ సినిమాలో నయనతార , సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ కూడా ఈ సినిమాలో కనిపించారు.

Chiranjeevi: ఆచార్య సినిమా కోసం పెద్దమొత్తంలో వదులుకున్న.. కేవలం వారికోసమే..! అదే నా ధర్మం
Chiranjeevi
Follow us on

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టేశారు. ఈ సినిమా కంటే ముందు వచ్చిన ఆచార్య సినిమా నిరాశపరిచిన ఏమాత్రం వెనకడుగు వేయకుండా రెట్టింపు ఉత్సాహంతో సినిమా చేసి గాడ్ ఫాదర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు చిరు. మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ లూసీఫర్ సినిమాకు రీమేక్ గా వచ్చింది. ఈ సినిమాలో నయనతార , సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ కూడా ఈ సినిమాలో కనిపించారు. ఇక పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

సినిమాని సమిష్టి కృషి అని నమ్ముతాను. ఒక విజయం వెనుక సమిష్టి కృషి వుంటుంది. అందుకే ఒక విజయం కేవలం నాదీ అని అనుకోను. ఏప్రిల్ లో వచ్చిన గత చిత్రం నిరాశ పరిచింద. దానికి చేయాల్సిన ధర్మం చేశాను. దానిని చెప్పుకుంటే చిన్నదైపోతుంది. చాలా పెద్ద మొత్తం నాది కాదని వదిలేశాను. రామ్ చరణ్ కూడా వదిలేశాడు. నేను వదులుకున్నది బయ్యర్లుని కాపాడుతుందనే సంతృప్తి నన్ను ఫ్లాఫ్ కి క్రుంగిపోయేలా చేయలేదు. గాడ్ ఫాదర్ విజయం కూడా కేవలం నాదీ అని అనుకోను. గాడ్ ఫాదర్ విజయం సమిష్టి కృషి. లూసిఫర్ ని చూసినప్పుడు అలాంటి పాత్రలు చేసి యాక్సప్టెన్సీ తెచ్చుకోగలిగితే మరిన్ని వైవిధ్యమైన కథలు, పాత్రలు చేసే అవకాశం ఉంటుందనే ఆలోచన వుండేది.

అలాగే చరణ్ బాబు ఒక రోజు లూసిఫర్ ప్రస్తావన తీసుకొచ్చారు. దర్శకుడు సుకుమార్ చిన్న చిన్న మార్పులు చేస్తే లూసిఫర్ నాకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని చెప్పారట. చరణ్ బాబు ఇలా చెప్పిన తర్వాత మరోసారి లూసిఫర్ చూశాను. సుకుమార్ ఐడియా ఇచ్చారు కానీ తర్వాత అందుబాటులో వుండలేదు. తర్వాత ఒకరిద్దరు దర్శకులతో చర్చలు జరిపాం. ఒక రోజు చరణ్ బాబు దర్శకుడు మోహన్ రాజా పేరు చెప్పారు. తని వరువన్ ని అద్భుతంగా తీసిన దర్శకుడు మోహన్ రాజా. లూసిఫర్ రీమేక్ మోహన్ రాజా న్యాయం చేస్తాడనే సంపూర్ణ నమ్మకం కలిగింది. మోహన్ రాజా కి కూడా ఇది ఇష్టమైన సబ్జెక్ట్. చేస్తానని చాలా ఉత్సాహంగా చెప్పారు. రచయిత సత్యనంద్ తో కూర్చుని టీం అంతా చాలా చక్కని మార్పులు చేర్పులు చేసి గాడ్ ఫాదర్ ని అద్భుతంగా మలిచారు అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.