AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: చనిపోయిన భర్త కల నెరవేర్చిన టాలీవుడ్ హీరోయిన్.. రజనీకాంత్‌తో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేసి..

గతంలో అల్లరి నరేష్ హీరోగా నటించిన బెండు అప్పారావు సినిమాలో హీరోయిన్ గా చేసింది మేఘనా రాజ్. అలాగే శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన లక్కీ సినిమాలోనూ కథానాయికగా నటించింది. ఇక ఈ అందాల తార కన్నడ యాక్షన్ హీరో చిరంజీవి సర్జాను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. కానీ..

Rajinikanth: చనిపోయిన భర్త కల నెరవేర్చిన టాలీవుడ్ హీరోయిన్.. రజనీకాంత్‌తో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేసి..
Rajinikanth, Meghana Raj
Basha Shek
|

Updated on: May 04, 2026 | 4:18 PM

Share

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా స్వయనా మేనల్లుడైన చిరంజీవి సర్జాకి కన్నడలో యాక్షన్ హీరోగా గుర్తింపు ఉండేది. ప్రస్తుతం కేడీ ది డెవిల్ సినిమాతో థియేటర్లలో రచ్చ చేస్తోన్న ధ్రువ్ సర్జాకు చిరంజీవి సొంత అన్నవుతాడు. కన్నడలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిర చిరంజీవి సర్జా 2020లో సడెన్ గా గుండెపోటుతో మరణించారు. దీంతో ఆయనను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ మేఘనా రాజ్ తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది. దీనికి తోడు భర్త చనిపోయేనాటికి ఆమె నిండు గర్భంతో ఉంది. దీంతో చాలా రోజుల వరకు ఈ విషాదం నుంచి బయటకు రాలేకపోయింది మేఘన. ఆమె సాధారణ స్థితికి చేరుకోవడానికి చాలా ఏళ్లు పట్టింది. ప్రస్తుతం పుట్టిన బిడ్డలోనే తన భర్తను చూసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తోంది మేఘనా రాజ్. కాగా పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైందీ అందాల తార. అయితే ఈ మధ్యన మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2లో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఇదే క్రమంలో కొడుకుతో పాటు రజనీకాంత్ ను కలిసిన ఆమె ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అనంతరం తన భర్తను తల్చుకుంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

ఈ సందర్భంగా రజనీతో దిగిన ఫొటోలోని పంచుకున్న మేఘనా సర్జా.. తన భర్తకు ఎంతో ఇష్టమైన భాషా బొమ్మపై స్వయంగా రజనీతో సంతకం కూడా చేయించింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఈ రోజు ఒక తేదీ మాత్రమే కాదు మన ఇద్దరి కల ఒక్కటైన రోజు. నా ప్రతి అడుగులోనూ నిన్ను ఫీలవుతున్నాను. నువ్వు ఆయనని(రజనీకాంత్) ఎంత ఆరాధించావో నాకు బాగా తెలుసు. నీ కోరిక వల్లే ఆయనని నేను కలిశాను. ఇది అసలు నేను కలలో కూడా ఊహించని విషయం. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం ‘జైలర్ 2’లో లభించింది. మనం సాధించాం. నా భర్తకే ఈ సినిమా అంకితం చేస్తున్నాను. ఈ సక్సెస్ అంతా ఆయనకే చెందుతుంది’ అని మేఘనా సర్జా భావోద్వేంగా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

రజనీకాంత్ తో మేఘనా సర్జా..

View this post on Instagram

A post shared by Meghana Raj Sarja (@megsraj)

కాగా మేఘనా రాజ్ గతంలో పలు తెలుగు సినిమాల్లో నటించింది. అల్లరి నరేశ్ ‘బెండు అప్పారావు’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె శ్రీకాంత్ లక్కీ సినిమాలోనూ కథానాయికగా చేసింది. ఆ తర్వాత పలు కన్నడ, మలయాళ మూవీస్ చేసింది. ఇదే క్రమంలో హీరో చిరంజీవి సర్జాను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

భర్త చిరంజీవి సర్జాతో మేఘనా రాజ్..

View this post on Instagram

A post shared by Meghana Raj Sarja (@megsraj)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రిలయన్స్ జోరు.. కేవలం 4 రోజుల్లో రూ. 1.39 లక్షల కోట్ల లాభం!
రిలయన్స్ జోరు.. కేవలం 4 రోజుల్లో రూ. 1.39 లక్షల కోట్ల లాభం!
శుక్రుడితో లక్ష్మీ యోగం! ఆ రాశుల వారికి సిరిసంపదలు ఖాయం..!
శుక్రుడితో లక్ష్మీ యోగం! ఆ రాశుల వారికి సిరిసంపదలు ఖాయం..!
చనిపోయిన భర్త కల నెరవేర్చిన టాలీవుడ్ హీరోయిన్.. బ్యూటిఫుల్ వీడియో
చనిపోయిన భర్త కల నెరవేర్చిన టాలీవుడ్ హీరోయిన్.. బ్యూటిఫుల్ వీడియో
టెట్‌ 2026కు భారీగా తగ్గిన దరఖాస్తులు.. పరీక్షలు ఎప్పుడంటే?
టెట్‌ 2026కు భారీగా తగ్గిన దరఖాస్తులు.. పరీక్షలు ఎప్పుడంటే?
సెప్టెంబర్ 8 నుండి ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్! మీ ఫోన్ కూడా ఉందా?
సెప్టెంబర్ 8 నుండి ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్! మీ ఫోన్ కూడా ఉందా?
తమిళనాడు సీఎం స్టాలిన్ ఘోర పరాజయం..
తమిళనాడు సీఎం స్టాలిన్ ఘోర పరాజయం..
టీవీకే విజయంపై విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఏమన్నారంటే..
టీవీకే విజయంపై విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఏమన్నారంటే..
నాలుగు గ్రహాల కటాక్షం.. అదృష్టం వారి తలుపు తట్టే ఛాన్స్..!
నాలుగు గ్రహాల కటాక్షం.. అదృష్టం వారి తలుపు తట్టే ఛాన్స్..!
ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాలు ఏవి? భారతదేశం ఎక్కడ?
ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాలు ఏవి? భారతదేశం ఎక్కడ?
ఓటమి దిశగా డీఎంకే పార్టీ.. వెక్కివెక్కి ఏడ్చిన కార్యకర్త
ఓటమి దిశగా డీఎంకే పార్టీ.. వెక్కివెక్కి ఏడ్చిన కార్యకర్త