Mana Shankara Vara Prasad Garu: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ టికెట్ రేట్లు పెరిగాయ్.. ప్రీమియర్ షో టికెట్ ఎంతంటే?

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మెగా మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్ర పోషించారు.

Mana Shankara Vara Prasad Garu: మన శంకరవరప్రసాద్‌గారు టికెట్ రేట్లు పెరిగాయ్.. ప్రీమియర్ షో టికెట్ ఎంతంటే?
Mana Shankara Vara Prasad Garu Movie

Updated on: Jan 09, 2026 | 8:29 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మన శంకరవరప్రసాద్‌గారు’. పక్కా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార కథానాయిక. విక్టరీ వెంకటేష్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన కంటెంట్ అభిమానులకు తెగ నచ్చేసింది. ట్రైలర్ తో పాటు పాటలు కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో స్పెషల్‌ ప్రీమియర్‌తో పాటు, టికెట్‌ ధరలు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రిలీజ్ కు ఒక్క రోజు ముందు అంటే జనవరి 11న మెగా మూవీ స్పెషల్‌ ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ షో టికెట్‌ ధరను రూ.500గా (జీఎస్టీతో కలిపి) నిర్ణయించారు. రాత్రి 8గంటల నుంచి 10 గంటల మధ్య ఈ ప్రీమియర్స్ షో ను ప్రదర్శించాల్సి ఉంటుంది.

ఇక జనవరి 12వ తేదీ నుంచి పది రోజుల పాటు సింగిల్‌ స్క్రీన్‌లో రూ.100 (జీఎస్టీతో కలిపి) మల్టీప్లెక్స్‌లలో రూ.125 (జీఎస్టీతో కలిపి) టికెట్‌ ధర పెంచుకునేందుకు ఏపీ సర్కార్ అవకాశం కల్పించింది. అలాగే, రోజుకు 5 షోలకు కూడా అనుమతి ఇచ్చింది. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కేథ‌రిన్ థ్రెసా, అభినవ్ గోమరం, సచిన్ ఖేడ్కర్, శరత్ సక్సేనా, హర్షవర్ధన్, రఘుబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భీమ్స్ స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ము రేపుతోన్న మన శంకరవరప్రసాద్ గారు..

మన  శంకరవరప్రసాద్ గారు ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .