Lucifer Remake: లూసిఫర్‌ రీమేక్‌లో భారీగా మార్పులు జరుగుతున్నాయా..? చిరు ఇమేజ్‌కు తగినట్లు..

Lucifer Remake Update: 'సైరా నర్సింహా రెడ్డి' తర్వాత మళ్లీ వెండి తెరపై కనిపించలేదు మెగాస్టార్‌ చిరంజీవి. తాజాగా ఆ లోటును పూడ్చడానికే అన్నట్లు ఒకేసారి మూడు చిత్రాలతో ప్రేక్షకులను అలరిచేందుకు..

Lucifer Remake: లూసిఫర్‌ రీమేక్‌లో భారీగా మార్పులు జరుగుతున్నాయా..? చిరు ఇమేజ్‌కు తగినట్లు..

Updated on: Feb 05, 2021 | 5:26 AM

Lucifer Remake Update: ‘సైరా నర్సింహా రెడ్డి’ తర్వాత మళ్లీ వెండి తెరపై కనిపించలేదు మెగాస్టార్‌ చిరంజీవి. తాజాగా ఆ లోటును పూడ్చడానికే అన్నట్లు ఒకేసారి మూడు చిత్రాలతో ప్రేక్షకులను అలరిచేందుకు సిద్ధమవుతున్నాడు చిరు.
ఈ మూడు చిత్రాల్లో… మలయాళ సినిమా లూసిఫర్‌ రీమేక్‌ ఒకటి. మలయాళంలో మోహన్‌లాల్‌ పోషించిన స్టీఫెన్‌ పాత్రలో చిరు నటించనున్నారు. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను చిత్రయూనిట్‌ ఇటీవలే ప్రారంభించింది. ఇదిలా ఉంటే లూసిఫర్‌ చిత్రం పేరుకే రీమేక్‌ అని కానీ పూర్తిగా మార్పులు చేయనున్నారని తెలుస్తోంది. కేవలం లూసిఫర్‌లోని కథను మాత్రమే తీసుకొని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లు సినిమాను రీమేక్‌ చేయనున్నారని సమాచారం. ముఖ్యంగా చిరు అభిమానులు కోరుకునే డ్యాన్స్‌, ఫైట్‌లు ఉండేలా దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

Also Read: Producer Ms Raju : ప్రముఖ నిర్మాత ఇంట పెళ్ళిసందడి.. మూడు రోజులపాటు జరగనున్నపెళ్లివేడుక..

Follow Us