
ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. సామాజిక సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తుంటుంది. ముఖ్యంగా మహిళల సమస్యలపై సోషల్ మీడియా వేదికగా తన గళాన్ని వినిపిస్తుంటుంది. ఆ మధ్యన మహిళల వస్త్రధారణకు సంబంధించి ఒక ప్రముఖ నటుడు చేసిన కామెంట్లపై చిన్మయి కూడా ఘాటుగా స్పందించింది. సామాజిక మాధ్యమాల వేదికగా వరుసగా పోస్టులు పెట్టింది. ఇక ఇదే వివాదంలో స్టార్ యాంకర్ అనసూయ కూడా ఎంట్రీ ఇచ్చింది. మహిలల డ్రెస్సింగ్ పై సదరు నటుడు చేసిన వ్యాఖ్యలను ఖండించింది. అయితే ఈ విషయంలో అనసూయ స్పందించిన తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది ఆమెకు మద్దతుగా నిలిస్తే.. కొందరు మాత్రం ఈ స్టార్ యాంకర్ తీరును తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ మహిళ నేత ప్రభ గౌడ అనసూయకు చీర ఛాలెంజ్ అంటూ ఒక వీడియోని విడుదల చేశారు. ‘సినిమా ఇండస్ట్రీలో అనసూయ కంటే చాలా గొప్ప వాళ్లు ఉన్నారు. వారందరూ కూడా ఎంతో సంస్కారవంతంగా ఉన్నారు. వారిని చూసి అనసూయ నేర్చుకోవాలి. ఎవరైతే అనసూయ కూడా చాలా పద్ధతిగా చీర కట్టుకొని ఉండాలి అనుకుంటారో వారందరూ కూడా నాలాగా ఆమెకు ఒక చీరను పంపించండి’ అంటూ ‘అనసూయకు చీర ఛాలెంజ్’ పేరుతో ఒక వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రభ గౌడ వీడియోపై సింగర్ చిన్మయి స్పందించింది. సోషల్ మీడియా వేదికగా బీజేపీ నాయకురాలికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది… ‘బీజేపీ మహిళా నాయకురాలు అనసూయ గురించి మాట్లాడుతూ.. అనసూయకు చీర పంపించి సరిగ్గా దుస్తులు ధరించడం నేర్పించండి అంట ఒక ఛాలెంజ్ చేస్తుంది. దుస్తుల కోసం స్త్రీలు ఏమాత్రం సిగ్గు పడకూడదనే అభిప్రాయం కోసం ఒక మహిళ ఇతర మహిళలను వేధించడంలో ఇలాంటి ఆలోచన కలిగే ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. ఈ ప్రపంచంలో ప్రతి చోట రాజకీయ నాయకులకు స్త్రీలను వేధించడానికి ఇంత సమయం ఉంటుందా’ అంటూ చిన్మయి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
So a female BJP politician here is ‘challenging’ people to send a Sari to Anasuya to ‘teach her to dress properly’.
I really didn’t think I would see this sort of horrendously deranged and regressive thinking would exist with women harassing other women for JUST AN OPINION to… pic.twitter.com/1QqmwUSlTZ
— Chinmayi Sripaada (@Chinmayi) January 16, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.