Hanu Man : హనుమాన్‌లో అవి చూపించలేదు.. చిలుకూరు బాలాజీ అర్చకులు రంగరాజన్ ఆసక్తికర కామెంట్స్

చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకొని వావ్ అనిపించింది. హనుమాన్ సినిమా ఏకంగా 250కోట్లకు పైగా వసూల్ చేసింది. హనుమాన్ సినిమా పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇతిహాసాల స్పూర్తితో హనుమంతుడి నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ.

Hanu Man : హనుమాన్‌లో అవి చూపించలేదు.. చిలుకూరు బాలాజీ అర్చకులు రంగరాజన్ ఆసక్తికర కామెంట్స్
Hanuman

Updated on: Jan 28, 2024 | 11:09 AM

హనుమాన్ సినిమా ఇప్పటికి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. జనవరి 12న సంక్రాంతికి కానుకగా హనుమాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకొని వావ్ అనిపించింది. హనుమాన్ సినిమా ఏకంగా 250కోట్లకు పైగా వసూల్ చేసింది. హనుమాన్ సినిమా పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇతిహాసాల స్పూర్తితో హనుమంతుడి నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. సినీ ప్రముఖులు కూడా హనుమాన్ సినిమా పై ప్రశంలు కురిపించడంతో పాటు చిత్రయూనిట్ కు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా హనుమాన్ సినిమా పై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

హనుమాన్ సినిమా సక్సెస్ లో భాగంగా చిత్రయూనిట్ థ్యాంక్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. హనుమాన్ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. తన నామాన్ని జపిస్తే బుద్ధి, బలం, ధైర్యం, నిర్భయత్వాన్ని ఆ ఆంజనేయస్వామి ప్రసాదిస్తారు. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు హనుమంతుడిని తలుచుకునేలా చేసిన చిత్రయూనిట్ కు నా కృతజ్ఞతలు. హనుమాన్ సినిమా చూసిన తర్వాత నాకు మాటలు రాలేదు. యంగ్‌ టీమ్‌ అద్భుతాన్ని సృష్టించింది. కథ విషయంలో చక్కగా రీసెర్చ్‌ చేశారు అని అన్నారు.

అలాగే సమాజానికి విలువైన చిత్రాలను అందించాలి. ‘హను-మాన్‌’లో ఎక్కడా అసభ్యత కనిపించలేదు. ఆడవాళ్లను వక్రీకరించి చూపిస్తేనే హిట్‌ అవుతుంది అనుకునేవాళ్ళుకు ఇదొక చెంపదెబ్బ అని చెప్పుకొచ్చారు రంగరాజన్. హనుమాన్ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించాడు. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటించారు.

ప్రశాంత్ వర్మ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

ప్రశాంత్ వర్మ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.