Vikramarkudu: హుర్రె.. “టెన్నిసు బంతుల పాప” ఇప్పుడెలా ఉందో చూస్తే మెంటలే..

రాజమౌళి సినిమాల్లో పక్కాగా యూత్‌ను ఆకట్టుకునేలా ఒక ఐటమ్ నంబర్‌ ఉంటుంది. అందులో పక్కాగా ఆకట్టుకునే ముద్దుగుమ్మలు ఉంటారు. అలానే విక్రమార్కుడు మూవీలో “టెన్నీస్ అమ్మడు కోర్టంతా దున్నుడు” అంటూ సాంగ్ లిరిక్ లో కనిపించిన నటి గుర్తుందా.? ఆమె ఎవరో తెలుసా.? ఇప్పుడేం చేస్తుంది....

Vikramarkudu: హుర్రె.. “టెన్నిసు బంతుల పాప” ఇప్పుడెలా ఉందో చూస్తే మెంటలే..
Kausha

Updated on: Apr 10, 2025 | 3:53 PM

రాజమౌళి సినిమా తీశారంటే అందులో మాస్, మసాల అంశాలు పక్కాగా మిళితం అయి ఉంటాయి. ఒక మాస్ ఆడియెన్స్‌కు ఫుల్ మీల్స్ అందించగలరు దర్శకధీరుడు. అందుకే ఆయనకు ఇంతవరకు ప్లాప్ అన్నదే లేదు. జక్కన్న చెక్కిన్న సినిమాల్లో విక్రమార్కుడుకు ఎప్పుడూ స్పెషల్ ప్లేస్ ఉంటుంది. రవితేజను ఈ సినిమా కోసం 1000 శాతం వాడుకుని.. 2000 శాతం రిజల్ట్ పట్టేశాడు రాజమౌళి. సినిమా కలెక్షన్ల ఊచకోత కోసింది. మాస్ రాజా డ్యూయల్ రోల్స్‌లో దుమ్ము దులిపేశాడు. అత్తిలి సత్తిబాబు అనే దొంగగా.. విక్రమ్ రాథోడ్‌ అనే పోలీస్ ఆఫీసర్‌గా దున్నేశాడు. సినిమాకు కీరవాణి అందించిన సంగీతం నెక్ట్స్ లెవల్. ముఖ్యంగా  “కాలేజ్ పాపల డ్రస్సు” సాంగ్ యూత్‌ను ఉర్రూతలూగించింది. . ఈ సాంగ్‌లో మెరుపు తీగలా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.  “టెన్నీస్ అమ్మడు కోర్టంతా దున్నుడు” అంటూ సాంగ్ లిరిక్‌లో కనిపించిన నటి గుర్తుందా.? ఆమె పేరు కౌశ.. ఈ అమ్మడు చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది.

దిల్, మన్మధుడు, ప్రేమాయ నమ: , అత్తిలి సత్తిబాబు LKG, రారాజు లాంటి చిత్రాల్లో నటించింది.  మంత్ర, కుబేరుల, బ్లేడ్ బాజ్జీ, ఇందుమతి, నేను మీకు తెలుసా, సిద్దు ప్లస్ 2, బ్రోకర్ , మహంకాళి అనే సినిమాల్లోనూ కనిపించింది. కానీ సూపర్ సక్సెక్ మాత్రం దక్కలేదు. ఈ అమ్మడు చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. సోషల్ మీడియాలో అంత యాక్టివ్ ఏం కాదు. అడపదడపా ఫోటోలు షేర్ చేస్తున్నా.. ఫాలోవర్స్ మాత్రం గట్టిగానే ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉందో దిగువన ఉన్న ఫోటోల్లో చూసేయండి..