Dandupalyam: సినిమాల్లోనే మొరటు.. రియల్ లైఫ్‌లో సో క్యూట్.. దండు పాళ్యం సినిమా హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా?

క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో సరికొత్త కొత్త ట్రెండ్ సృష్టించిన దండు పాళ్యం సినిమాను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఈ సిరీస్ లో ఏకంగా నాలుగు సినిమాలు వచ్చాయి.

Dandupalyam: సినిమాల్లోనే మొరటు.. రియల్ లైఫ్‌లో సో క్యూట్.. దండు పాళ్యం సినిమా హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా?
Dandupalyam Actress

Updated on: Apr 26, 2025 | 5:13 PM

2012లో వచ్చిన దండుపాళ్యం సినిమా కన్నడ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అంతేకాదు పలు కేంద్రాలలో 100 రోజులకు పైగా ఆడింది. కేవలం కన్నడలోనే కాదు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేయగా, ప్రతి చోటా దండుపాళ్యం సినిమా సంచలన విజయం సాధించింది. క్రైమ్ సినిమాల్లో సరికొత్త ఒరవడిని తీసుకొచ్చిన దండు పాళ్యం సిరీస్ లో మొత్తం నాలుగు సినిమాలు వచ్చాయి. దండుపాళ్యం 2 జూలై 2014లో రిలీజ్ కాగా, ఆ వెంటనే దండు పాళ్యం 3 కూడా వచ్చింది. ఆ తర్వాత కె.టి.నాయక్ దర్శకత్వం వహించిన దండుపాళ్య 4 2019లో విడుదలైంది. కాగా దండు పాళ్యం అంటేనే ఒక క్రూరమైన గ్యాంగ్ కళ్ల ముందు మొదులుతుంది. పూజా గాంధీ,రవి కాలే, మకరంద్ దేశ్‌పాండే, పి. రవిశంకర్, రఘు ముఖర్జీ, ప్రియాంక కొఠారి, జయ దేవ్ మోహన్ ఇలా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. మరీ ముఖ్యంగా దండా పాళ్యం ముఠా నాయకురాలి పాత్రలో లక్ష్మీ అలియాస్ పూజా గాంధీ హైలెట్ గా నిలిచింది. చూడ్డానికి అమాయకంగా కనిపిస్తూనే క్రూరంగా హత్యలు చేసే ఈ పాత్రలో పూజా అభినయం ఆడియెన్స్ ను బాగా భయ పెట్టింది. అలాగే కొన్ని సన్నివేశాల్లో బోల్డ్ గానూ నటించి మెప్పించింది.

కాగా దండు పాళ్యం సినిమాలో మొరటుగా, క్రూరంగా కనిపించిన పూజా గాంధీ నిజ జీవితంలో చాలా అందంగా, హుందాగా కనిపిస్తుంటుంది. ఇప్పటి దాకా సుమారు 50 సినిమాల్లో నటించిందీ అందాల తార. కన్నడతో పాటు తెలుగు, హిందీ సినిమాల్లోనూ నటించి ఆడియెన్స్ ను అలరించింది. చివరిగా దండుపాళ్యం 3 సినిమాలో కనిపించిన పూజా ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉంది.

ఇవి కూడా చదవండి

 

పూజా గాంధీ లేటెస్ట్ ఫొటోస్..

సినిమాల సంగతి పక్కన పెడతే పూజా గాంధీ నవంబర్ 2012లో పారిశ్రామికవేత్త ఆనంద్ గౌడతో నిశ్చితార్థం చేసుకుంది. అయితే ఏమైందో కానీ ఆ తర్వాతి నెలలోనే ఇద్దరూ విడిపోయారు. ఇక 2023లో పూజా తన చిరకాల స్నేహితుడు, వ్యాపారవేత్త విజయ్ ఘోర్పడేతో కలిసి పెళ్లి పీటలెక్కింది. సినిమాలకు దూరమైనా సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటోంది పూజా. అలాగే పలు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ఆ ఫొటోలను అందులో షేర్ చేస్తుంటుంది. అలా తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ అసలు ఈమె దండుడుపాళ్యం హీరోయినేనా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.

సామాజిక సేవా కార్యక్రమాల్లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.