ఆ టైంలో చచ్చిపోయా అనుకున్నా.. తలుచుకుంటే ఇప్పటికీ వణుకు పుడుతుందంటున్న హీరోయిన్

టాలీవుడ్ హీరోయిన్ చాందిని చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించిన ఈ అందాల తార ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. కలర్ ఫొటో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే సంతాన ప్రాప్తిరస్తి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది..

ఆ టైంలో చచ్చిపోయా అనుకున్నా.. తలుచుకుంటే ఇప్పటికీ వణుకు పుడుతుందంటున్న హీరోయిన్
Chandini Chowdary

Updated on: Dec 29, 2025 | 2:00 PM

తెలుగు అమ్మాయిలు ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. వారిలో చాందిని చౌదరి ఒకరు. షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయిన్ గా ఎదిగింది చాందిని. హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టి అలాగే సహాయక పాత్రల్లోనూ మెప్పిస్తూ రాణిస్తుంది చాందిని చౌదరి. ఇటీవలే సంతాన ప్రాప్తిరస్తూ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ ముద్దుగుమ్మ హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. కాగా ఓ ఇంటర్వ్యూలో చాందిని మాట్లాడుతూ షాకింగ్ విషయాలు బయట పెట్టింది. ఓ సినిమా షూటింగ్ లో భయంకరమైన సంఘటనలు జరిగాయి అని తెలిపింది.

ఓ ఇంటర్వ్యూలో చాందిని చౌదరి మాట్లాడుతూ.. విశ్వక్ సేన్ హీరోగా నటించిన గామి షూటింగ్‌లో ఎదుర్కొన్న రెండు భయానక సంఘటనలను పంచుకుంది. హిమాలయాల అద్భుతమైన నేపథ్యంలో చిత్రీకరించిన ఈ చిత్రంలో చాందిని చౌదరి కీలక పాత్రలో నటించింది. ఆ సినిమా షూటింగ్ లో జరిగిన కొన్ని సన్నివేశాలు ఆమెకు జీవితాంతం గుర్తుండిపోతాయని చెప్పుకొచ్చింది. మొదటి సంఘటన డ్రోన్ షాట్ చిత్రీకరణ సమయంలో జరిగిందట. విశ్వక్‌తో కలిసి చాందిని ఒక పర్వతాన్ని ఎక్కవలసి వచ్చింది. ఆ పర్వతాన్ని ఎక్కే రూట్ చాలా టఫ్.. అది ఎక్కే సీన్ లో విశ్వక్ ఎలాంటి లాగేజ్ లేకుండా ఒక్కడే పైకి ఎక్కేవాడు.. కానీ నాకు ఓ  మాత్రం బరువైన బ్యాగ్ అంటగట్టారు. దాదాపు 45 నుండి 60 డిగ్రీల వాలు ఉన్న ఆ నిటారు మార్గంలో ఆ బ్యాగ్‌తో ఎక్కడం తనకు సవాలుగా మారిందని చెప్పింది. నేను పైకి  ఎక్కుతుంటే ఆ బ్యాగ్ నన్ను వెనక్కి లాగుతోంది. ఒక సమయంలో నేను వెనక్కి పడిపోబోయాను. అప్పుడు బ్యాగ్‌ను వదిలేశాను. అది దొర్లుకుంటూ కిందకు వెళ్లిపోయింది చెప్పింది. ఆ తర్వాత ఆమె మళ్లీ కిందకు వెళ్లి బ్యాగ్‌ను తెచ్చి, ఎంతో కష్టపడి ఆ పర్వతాన్ని ఎక్కి డ్రోన్ షాట్‌ను పూర్తి చేసిందట. ఎంత సమయం పట్టిందో కూడా తనకు గుర్తు లేదని చెప్పుకొచ్చింది.

రెండవ సంఘటన, అంతకుమించి భయంకరమైనది, గడ్డకట్టిన సరస్సుపై జరిగింది. అదొక ఎక్స్‌పెడిషన్స్ జరిగే ప్రాంతం. వెళ్లే సమయానికి సరస్సు పూర్తిగా గడ్డకట్టుకుపోయింది. డ్రోన్ షాట్స్ కోసం సరస్సుపై ఒంటరిగా నడుస్తూ వెళ్లాలి. ముందుగా, సినిమా టీమ్ కొంత దూరం వరకు మంచు బలంగా ఉందని చెక్ చేశారు,దాంతో తనను దాని పై వెళ్ళమని చెప్పారు. అయితే, అది షూట్ చేసే సమయంలో.. ఇద్దరు కెమెరామెన్‌లు కెమెరాలతో పాటు ఉన్నారట, పైన డ్రోన్ కూడా ఉంది. అయితే చాందిని నడుస్తూ వెళ్తుండగా, అకస్మాత్తుగా మంచు పగులుతున్న శబ్దం వినిపించిందట. నేను లోపలికి వెళ్తే, ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాను. పైకి రావడం అసాధ్యం, అంతా అయిపోయినట్లే అని ఆ క్షణాలను గుర్తుచేసుకుంటూ చేసుకుంది చాందిని. అప్పుడు అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా, బిగుసుకుపోయి చూశారు. ఆమె కదల్లేని పరిస్థితిలో ఉండిపోయింది, కదిలితే మంచు పూర్తిగా పగిలిపోతుందని భయం. ఏం చేయాలో తెలియని ఆ క్షణంలో, కొంచెం స్పేస్ ఇవ్వండి, నేను దూకడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి, మొదట బ్యాగ్‌ను విసిరివేసిందట. ఆ తర్వాత గట్టిగా ఊపిరి పీల్చుకుని, ఒక్కసారిగా దూకి, అదృష్టవశాత్తు బయటపడ్డా.. నేను నిలబడిన చోట సరిగ్గా ఒక పెద్ద రంధ్రం ఏర్పడిందని చెప్పుకొచ్చింది. ఆ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడటం నిజంగా ఒక అద్భుతమని, దాని గురించి చెప్పేటప్పుడు కూడా తనకు వణుకు పుడుతుందని చాందిని చౌదరి చెప్పుకొచ్చింది. ఇది తన జీవితంలో ఎదురైన అత్యంత భయంకరమైన అనుభవమని ఆమె తెలిపింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.