Sundeep Kishan: సిగ్మాలో స్పెషల్ సాంగ్.. సందీప్ కిషన్‏తో కలిసి స్టెప్పులేయనున్న టాలీవుడ్ హీరోయిన్..

విజయ్ దళపతి క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. సౌత్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన ఈ హీరో.. ఇప్పుడు ప్రత్యేక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కానీ ఆయన కొడుకు మాత్రం హీరోగా కాకుండా దర్శకుడిగా తెరంగేట్రం చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

Sundeep Kishan: సిగ్మాలో స్పెషల్ సాంగ్.. సందీప్ కిషన్‏తో కలిసి స్టెప్పులేయనున్న టాలీవుడ్ హీరోయిన్..
Sandeep Kisan

Updated on: Dec 07, 2025 | 7:57 PM

సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో విజయ్ దళపతి ఒకరు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ హీరో ప్రత్యేక్ష రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అటు సినిమాలు తగ్గించి.. ఇటు ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే.. విజయ్ దళపతి తనయుడు జాసన్ సంజయ్ తండ్రి బాటలో హీరోగా కాకుండా దర్శకుడిగా మారారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం ఇప్పుడు వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో తెలుగు హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల క్రితమే వీరిద్దరి ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. ఇప్పుడు ఈ మూవీలో మరో హీరోయిన్ జాయిన్ అయ్యింది.

విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా పేరు సిగ్మా. ఇందులో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. తెలుగులో ఫేమస్ అయిన సందీప్.. మానగరం, రాయన్ వంటి చిత్రాలతో అటు తమిళ సినీప్రియులకు దగ్గరయ్యారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న సిగ్మా చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కానీ ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండేనున్నట్లు సమాచారం. అయితే అందులో ప్రముఖ హీరోయిన్ కేథరిన్ టెస్రా కనిపించనుందట..

తాజా సమాచారం ప్రకారం ఈ స్పెషల్ సాంగ్ కోసం కేథరిన్ ఇప్పుడు షూటింగ్ లో జాయిన్ అయ్యిందని సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. చాలా కాలంగా తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తున్న కేథరిన్.. ఇప్పటివరకు సరైన బ్రేక్ అందుకోలేకపోయింది.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్‏లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..