Trisha-Mansoor Ali Khan: త్రిషపై అసభ్య కామెంట్స్.. మన్సూర్ అలీ ఖాన్ పై కేసు నమోదు..

మంగళవారం ఈ వివాదంపై స్పందించిన మన్సూర్ అలీఖాన్.. తాను త్రిషకు క్షమాపణలు చెప్పనని అన్నారు. తాను తప్పుగా ఏం మాట్లాడలేదని.. తానేంటో తమిళనాడు ప్రజలకు తెలుసు అని.. వారి మద్దతు తనకు ఉందని పేర్కొన్నారు. సినిమాల్లో హత్య చేస్తే నిజంగానే చేసినట్లా ? అలాగే సినిమాల్లో రేప్ చేస్తే నిజంగానే చేసినట్లా ? అంటూ మాట్లాడారు. దీంతో అతడి మాటలపై ఆగ్రహం వ్యక్తం చేసిన నడిగర్ సంఘం అతడిని పాక్షికంగా నిషేధించింది.

Trisha-Mansoor Ali Khan: త్రిషపై అసభ్య కామెంట్స్.. మన్సూర్ అలీ ఖాన్ పై కేసు నమోదు..
Mansoor Ali Khan

Updated on: Nov 22, 2023 | 1:05 PM

హీరోయిన్ త్రిషపై కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అతడి వ్యాఖ్యలపై సినీ, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లియో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, నితిన్, మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ మాళవిక, సింగర్ చిన్మియి, మంత్రి రోజా త్రిషకు మద్దతు తెలిపారు. మన్సూర్ అలీఖాన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అతడి మాటలను తీవ్రంగా పరిగణించిన జాతీయ మహీళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. మన్సూర్ పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులను ఆదేశాలు జారీ చేసింది.. దీంతో అతడిపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. నివేదిక ప్రకారం, మన్సూర్ అలీ ఖాన్‌పై సెక్షన్ 354 A (లైంగిక వేధింపులు), సెక్షన్ 509 (మహిళా గౌరవానికి భంగం కలిగించే పదం, సంజ్ఞ లేదా చర్య) కింద కేసు నమోదు చేశారు చెన్నై పోలీసులు.

నటి త్రిష కృష్ణ పట్ల నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. IPC సెక్షన్ 509 B, ఇతర సంబంధిత చట్టాలను అమలు చేయవలసిందిగా DGPని ఆదేశిస్తూ.. “మేము ఈ విషయంలో సొంతంగా నిర్ణయం తీసుకుంటున్నాము. ఇటువంటి వ్యాఖ్యలు మహిళలపై హింసను ప్రేరేపిస్తాయి. అతడి మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం” అంటూ NCW ప్రకటన విడుదల చేసింది.

అయితే మంగళవారం ఈ వివాదంపై స్పందించిన మన్సూర్ అలీఖాన్.. తాను త్రిషకు క్షమాపణలు చెప్పనని అన్నారు. తాను తప్పుగా ఏం మాట్లాడలేదని.. తానేంటో తమిళనాడు ప్రజలకు తెలుసు అని.. వారి మద్దతు తనకు ఉందని పేర్కొన్నారు. సినిమాల్లో హత్య చేస్తే నిజంగానే చేసినట్లా ? అలాగే సినిమాల్లో రేప్ చేస్తే నిజంగానే చేసినట్లా ? అంటూ మాట్లాడారు. దీంతో అతడి మాటలపై ఆగ్రహం వ్యక్తం చేసిన నడిగర్ సంఘం అతడిని పాక్షికంగా నిషేధించింది. అటు మన్సూర్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది.

గతంలో ఓ ఇంటర్వ్యూలో మన్సూర్ అలీ ఖాన్ తమిళంలో మాట్లాడుతూ, “నేను త్రిషతో నటిస్తున్నానని విన్నప్పుడు, సినిమాలో బెడ్ రూమ్ సీన్ ఉంటుందని అనుకున్నాను. నేను చాలా సినిమాల్లో రేప్ సీన్స్ చేశాను. సినిమాల్లో ఇతర నటీమణులతో చేసినట్లే త్రిషతో బెడ్ రూం సీన్ ఉంటుందని అనుకున్నాను. కానీ కాశ్మీర్‌లో షూటింగ్ సమయంలో త్రిషను సెట్స్‌లో కూడా నాకు చూపించలేదు.” అని అన్నారు. దీంతో అతడిపై అసహనం వ్యక్తం చేసింది త్రిష. ఇక భవిష్యత్తులో అలాంటి నటుడితో నటించనని చెప్పేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.