Lokesh kanagaraj: ‘లియో’ దర్శకుడికి షాక్.. లోకేష్ మానసిక పరిస్థితి బాలేదంటూ కోర్టులో పిటిషన్..

మాస్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 19న విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. అటు తమిళం, ఇటు తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓవైపు విమర్శలు వచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కానీ ఈ సినిమాలో వయోలెన్స్ ఎక్కువగా ఉందని ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‏కు షాక్ తగిలింది. అతడి పరిస్థితి బాగాలేదని.. మానసిక పరీక్షలు నిర్వహించాలని మధురై హైకోర్టు బెంచ్‏లో పిటిషన్ దాఖలైంది.

Lokesh kanagaraj: లియో దర్శకుడికి షాక్.. లోకేష్ మానసిక పరిస్థితి బాలేదంటూ కోర్టులో పిటిషన్..
Lokesh Kanagaraj

Updated on: Jan 04, 2024 | 11:46 AM

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస హిట్స్ అందుకుంటున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఇటీవలే లియో సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. విజయ్ దళపతి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని వివాదాలు మాత్రం విడడం లేదు. రిలీజ్‏కు ముందే ఈ సినిమాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. మాస్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 19న విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. అటు తమిళం, ఇటు తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓవైపు విమర్శలు వచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కానీ ఈ సినిమాలో వయోలెన్స్ ఎక్కువగా ఉందని ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‏కు షాక్ తగిలింది. అతడి పరిస్థితి బాగాలేదని.. మానసిక పరీక్షలు నిర్వహించాలని మధురై హైకోర్టు బెంచ్‏లో పిటిషన్ దాఖలైంది.

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది లియో చిత్రం. అయితే లోకేష్ మానసిక పరిస్థితి బాగలేదని.. అతడికి వెంటనే సైకలాజికల్ పరీక్షలు నిర్వహించాలంటూ మధురైకి చెందిన రాజు మురుగన్ పిటిషన్ వేశారు. లియో సినిమాలో చాలా సన్నివేశాలు హింసాత్మకంగా ఉన్నాయని.. తుపాకులు, కత్తులు, ఆయుధాల సంస్కృతిని హింసాత్మకంగా చూపిస్తున్నారని.. వివాదాస్పద అభిప్రాయాలను ప్రదర్శించడానికి మతపరమైన చిహ్నాలను ఉపయోగించే దృశ్యాలు ఉన్నాయని.. సినిమాను వెంటనే బ్యాన్ చేయాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై జస్టిస్ కృష్ణ కుమార్, జస్టిస్ విజయ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కాగా లోకేష్ తరుపు న్యాయవాదులు హాజరు కాకపోవడంతో విచారణ వాయిదా పడింది.

లియో సినిమాలో విజయ్ సరసన త్రిష కథానాయికగా నటించింది. ఇందులో సంజయ్ దత్, అర్జున్ సజ్జా, మాథ్యూథామస్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్ కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రాన్ని సెవెన్ స్టూడియో పై లలిత్ కుమార్ నిర్మించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.