Tollywood: పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. సెల్ఫీ అంటే మాత్రం సిగ్గుపడిపోతున్న బ్యూటీ..

గత రెండేళ్లుగా వరుసగా బ్లాక్ బస్టర్ చిత్రాలతో అగ్రకథానాయికగా దూసుకుపోతుంది. తెలుగు, తమిళం, హిందీలో అనేక చిత్రాల్లో నటించి కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ ప్రశంసలు అందుకుంటుంది. వెండితెరపై సత్తా చాటుతోన్న ఈ బ్యూటీ.. సెల్ఫీ అంటే మాత్రం తెగ సిగ్గుపడిపోతుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టగలరా ?..

Tollywood: పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. సెల్ఫీ అంటే మాత్రం సిగ్గుపడిపోతున్న బ్యూటీ..
Rashmika Mandanna

Updated on: May 03, 2024 | 9:30 AM

ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్. గత రెండేళ్లుగా వరుసగా బ్లాక్ బస్టర్ చిత్రాలతో అగ్రకథానాయికగా దూసుకుపోతుంది. తెలుగు, తమిళం, హిందీలో అనేక చిత్రాల్లో నటించి కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ ప్రశంసలు అందుకుంటుంది. వెండితెరపై సత్తా చాటుతోన్న ఈ బ్యూటీ.. సెల్ఫీ అంటే మాత్రం తెగ సిగ్గుపడిపోతుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టగలరా ?.. ఆమె మరెవరో కాదండి.. కుర్రాళ్ల దిల్ క్రష్..నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. సినీ ప్రియులు అత్యంత ఇష్టపడే సెలబ్రెటీలలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. అందం, అభినయం.. తెలివి.. సున్నితత్వం ప్రేక్షకులను దగ్గర చేశాయి. ఈ బ్యూటీకీ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఉంది. ప్రస్తుతం సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన సెల్ఫీలు వైరలవుతున్నాయి.

తాజాగా కొన్ని సెల్ఫీ ఫోటోస్ షేర్ చేస్తూ ఆసక్తికర కోట్ రాసుకొచ్చింది. “మీపై మంచి ఫోకస్.. వెలుగు ఉందని మీకు తెలిసినప్పుడు.. లేదా సెల్ఫీలు తీసుకున్నప్పుడు మీరు చాలా సిగ్గుపడతారు” అంటూ రాసుకొచ్చింది. రష్మిక షేర్ చేసిన ఫోటోలలో తన ఫేస్ కవర్ చేసింది రష్మిక. అందులో బ్లాక్ టీ షర్ట్ ధరించి.. మేకప్ లేకుండా కనిపించింది. ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఇటీవలే యానిమల్ సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇందులో గీతాంజలి పాత్రలో తన అద్భుతమైన నటనతో సినీ క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది.

యానిమల్ హిట్ తర్వాత ఇప్పుడు మరో హిట్ కోసం వెయిట్ చేస్తుంది. అదే పుష్ప 2. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇవే కాకుండా గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో చిత్రాల్లో నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.