మాస్ యాక్షన్ చిత్రాలతో సౌత్ అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాడు. ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టి టాప్ హీరోగా ఎదిగాడు. బుల్లితెరపై పలు సీరియల్స్ లో హీరోగా కనిపించిన ఆ కుర్రాడు.. మొదట్లో ఫ్యామిలీ అడియన్స్.. ఆ తర్వాత యూత్ ఫేవరేట్ హీరోగా మారిపోయాడు. ఇప్పుడు ఆ పాన్ ఇండియా స్టార్ హీరో చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లక్షలాది మంది అభిమానంతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. ఇంతకీ పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నోడు ఎవరో తెలుసా.. అతడే కన్నడ స్టార్ హీరో యష్. సాధారణ బస్ డ్రైవర్ కొడుకు నుంచి కోట్లాది మంది అభిమానుల ఫేవరేట్ హీరోగా.. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యష్ చిన్ననాటి ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శిస్తుంది.
పైన కనిపిస్తున్న ఫోటో యష్ చిన్నప్పుడు స్కూల్లో ఉన్న పిక్. ఓ వేడుకలో తన పాఠశాల ఉపాధ్యాయుల నుండి అవార్డును అందుకుంటున్న సమయంలో తీసిన ఫోటో. తెల్ల చొక్కా, ఎరుపు రంగు టై, ఖాకీ షార్ట్‌లు ధరించి కనిపించాడు యష్. ప్రస్తుతం ఈ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు యష్ ఫ్యాన్స్. తమ అభిమాన హీరో చిన్నప్పుడు ఎంత క్యూట్ గా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇది చదవండి : Bhadra Movie: వార్నీ.. ఏం ఛేంజ్ భయ్యా..’భద్ర’ మూవీలో రవితేజ మరదలు.. ఇప్పుడు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..
2007లో జంబద హుడుగి చిత్రంతో యష్ కన్నడ సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించాడు. 2018లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ చిత్రం అతడి కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతోపాటు యష్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. కేజీఎఫ్ చాప్టర్ 1,2 చిత్రాల్లో నటించిన యష్.. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు.
ఇది చదవండి :
Actress Laya: అందంలో అమ్మను మించిపోయిన డాటర్.. హీరోయిన్ లయ కూతురిని చూశారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.