Tollywood: పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్స్.. 50 ఏళ్ల వయసూలోనూ ఒంటరిగా.. ఈ హీరోయిన్ ఎవరంటే..
సోషల్ మీడియాలో సినీతారల వ్యక్తిగత విషయాల తెగ వైరలవుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ పర్సనల్ విషయాలు చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఓ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. ? ఆమె ఒకప్పుడు అగ్రకథానాయిక.

పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. హిందీ, తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. ఆమె హృతిక్ రోషన్‌తో కలిసి సినిమాల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆమె ఒకప్పుడు కరీనా కపూర్ , ప్రియాంక చోప్రా వంటి నటీమణులతో పోటీ పడేది. ఆమె చాలా కాలం పాటు వెండితెరకు దూరంగా ఉంది. ఇప్పుడు, సెకండ్ ఇన్నింగ్స్ లో సత్తా చాటుతుంది. ఆమె మరెవరో కాదు.. అమీషా పటేల్. ఈ నలుపు-తెలుపు బాల్య ఫోటోలో, దివా తన తమ్ముడు అష్మిత్‌తో కలిసి కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..
2000 సంవత్సరంలో హృతిక్ రోషన్ సరసన నటించిన తన తొలి చిత్రం కహో నా ప్యార్ హై తో అమీషా పటేల్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మొదటి సినిమాతోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. ఈ సినిమా పలు విభాగాల్లో 92 అవార్డులను గెలుచుకుంది. ఆ తర్వాత పవన్ జోడిగా ఆమె నటించిన బద్రి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. కొంత విరామం తర్వాత, అమీషా పటేల్ సన్నీ డియోల్ తో కలిసి తన బ్లాక్ బస్టర్ హిట్ గదర్ కి సీక్వెల్ అయిన గదర్ 2 తో వెండితెరపై తిరిగి కనిపించింది.
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీగా ఉంటుంది. ఇదిలా ఉంటే. ప్రస్తుతం ఆమె వయసు 50 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటుంది. కానీ ఈ ముద్దుగుమ్మ ప్రేమకథలు మాత్రం ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంటాయి. ప్రస్తుతం ఆమె ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉందనే టాక్ నడుస్తుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..
