Tollywood: ఒకప్పుడు తోపు హీరోయిన్.. ఇప్పుడు క్లాసికల్ డ్యాన్సర్‏గా.. లేడీ సూపర్ స్టార్ ఎవరో గుర్తుపట్టారా..?

చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఒకప్పుడు ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్. మోహన్ లాల్, చిరంజీవి, రజినీకాంత్, మోహన్ బాబు, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటించి లేడీ సూపర్ స్టార్ గా నిలిచింది.

Tollywood: ఒకప్పుడు తోపు హీరోయిన్.. ఇప్పుడు క్లాసికల్ డ్యాన్సర్‏గా.. లేడీ సూపర్ స్టార్ ఎవరో గుర్తుపట్టారా..?
Actress New

Updated on: Jun 02, 2025 | 12:23 PM

సినీరంగంలో ఒకప్పుడు తోపు హీరోయిన్. అందం, అభినయంతో సౌత్ ఇండస్ట్రీని ఏలేసిన ఈ హీరోయిన్.. హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది. తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి లేడీ సూపర్ స్టార్ గా అభిమానుల హృదయాలు గెలుచుకుంది. అంతేకాదు.. అద్భుతమైన నటనకుగానూ పద్మ శ్రీ, పద్మభూషణ్ అవార్డ్స్ అందుకుంది. మలయాళీ సినీరంగంలో మొదటి సినిమాతోనే ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. తమిళంలో రజినీతో కలిసి ఓ సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన చిత్రాలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్. ఇప్పటికీ సినీరంగంలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. అలాగే మరోవైపు క్లాసికల్ డ్యాన్సర్ గా.. పలువురు విద్యార్థులకు శాస్త్రీయ నృత్యం నేర్పిస్తుంది. ఇటీవల ఆమె నటించిన ఓ సినిమా ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తుంది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? తనే హీరోయిన్ శోభన.

సూపర్ స్టార్ రజినీకాంత్, శోభన కలిసి నటించిన దళపతి చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అటు మ్యూజిక్ పరంగానూ ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. భారతీయ చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న శోభన.. వేదికలపై ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. దశాబ్దాలుగా సినీకళా రంగాన్ని ఏలింది. ఆమె చివరిసారిగా కొచ్చాడియన్ చిత్రంలో నటించింది. పెళ్లికి దూరంగా ఒంటరిగా నివసిస్తుంది శోభన.

అలాగే చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్సర్ అయిన శోభన.. ఇప్పుడు సొంతంగా ఒక ఇన్ స్టిట్యూట్ స్టార్ట్ చేసి ఎంతోమందికి శాస్త్రీయ నృత్యం నేర్పిస్తుంది. అలాగే అప్పుడప్పుడు కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తుంది. ఇటీవలే మోహన్ బాబు జోడిగా తుడురమ్ చిత్రంలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీని షేక్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి :  

OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..

Nagarjuna: టాలీవుడ్‏ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..

Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..