Tollywood Actress: పద్దతికి చీరకట్టినట్లు ఉన్న అమ్మాయి.. ఇప్పుడు నెట్టింట అందాల అరాచకం.. ఎవరో గుర్తించారా.. ?

|

May 26, 2024 | 10:55 AM

తెలుగు, తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించింది. అందం, అభినయం ఎంత ఉన్నా.. అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. మణిరత్నం వంటి స్టార్ డైరెక్టర్ సినిమాలో కీలకపాత్ర పోషించింది. అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. అయినా ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం రావట్లేదు. ఇప్పుడు ఈ బ్యూటీ ఆడపాదడపా చిత్రాల్లో నటిస్తూ సరైన ఆఫర్ కోసం వెయిట్ చేస్తుంది.

Tollywood Actress: పద్దతికి చీరకట్టినట్లు ఉన్న అమ్మాయి.. ఇప్పుడు నెట్టింట అందాల అరాచకం.. ఎవరో గుర్తించారా.. ?
Heroine
Follow us on

పైన ఫోటోలో పద్దతికి పట్టు చీరకట్టినట్లుగా కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా ?. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. డాక్టర్ చదువు పూర్తి చేసి అటు వైద్యురాలిగా విధులు నిర్వహిస్తూ.. ఇటు నటనతో ప్రేక్షకులను అలరిస్తుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించింది. అందం, అభినయం ఎంత ఉన్నా.. అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. మణిరత్నం వంటి స్టార్ డైరెక్టర్ సినిమాలో కీలకపాత్ర పోషించింది. అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. అయినా ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం రావట్లేదు. ఇప్పుడు ఈ బ్యూటీ ఆడపాదడపా చిత్రాల్లో నటిస్తూ సరైన ఆఫర్ కోసం వెయిట్ చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా..?. గ్లామర్ రోల్స్ కాకుండా వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా తనను తాను నిరూపించుకుంది. నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆ హీరోయిన్ మరెవరో కాదు.. మలయాళీ కుట్టి ఐశ్వర్య లక్ష్మి. ఇప్పుడు ఈహీరోయిన్ మోడలింగ్ రోజుల ఫోటో నెట్టింట వైరలవుతుంది.

ఐశ్వర్య ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేసి డాక్టర్ అయ్యాక యాక్టింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ‘నందలార్ నాడు నాడ్ ఓరితవేళ’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఐశ్వర్య.. ‘మాయానది’, ‘వరతన్’, విజయ్ సూపరం పౌర్ణమి, అర్జెంటీనా ఫ్యాన్స్ కట్టూర్కాడవ్, బ్రదర్స్ డే వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఐశ్వర్య తమిళంలో విశాల్ నటించిన ‘అక్షిణి’ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఇక విక్కీ విశాల్ సరసన నటించిన మట్టి కుస్తి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. డైరెక్టర్ మణిశర్మ తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషించింది.

1991 సెప్టెంబర్ 6న కేరళలోని త్రివేండ్రంలో జన్మించింది ఐశ్వర్య లక్ష్మి. 2017లో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఆ తర్వాత కొంతకాలం ఇంటర్న్ షిప్ చేసింది. మోడలింగ్ పై ఆసక్తి ఎక్కువగా ఉండడంతో 2014 నుంచి మోడలింగ్ లో శిక్షణ తీసుకుంది. ఆ సమయంలోనే పలు వాణిజ్య ప్రకటనల్లో నటించింది. తాను నటిని కావాలని ఎప్పుడూ అనుకోలేదని.. ఎంబీబీఎస్ పూర్తైన వెంటనే ‘నంజాన్‌డుకలుడే నట్టి ఒరిదవేల’ క్యాస్టింగ్‌ కాల్‌ చూసి ప్రయత్నించగా.. సెలెక్ట్‌ అయ్యానని చెప్పుకొచ్చింది. 2022లో గాడ్సే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఇటీవల విడుదలైన కింగ్ ఆఫ్ కోత చిత్రంలో కనిపించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఐశ్వర్య నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.