ఈమె ఓ పాన్ వరల్డ్ స్టార్. అందంతో కుర్రకారును కట్టిపడేస్తే.. అభినయంతో ప్రేక్షకులను మంత్రంముగ్దులను చేస్తుంది. ఇండస్ట్రీలోకి గాడ్ ఫాదర్ లేకుండా అడుగుపెట్టింది.. అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ స్టేటస్ సంపాదించింది. తమిళ సినిమాతో తన సినీ కెరీర్ ఆరంభించి.. ఆ తర్వాత హిందీలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుని.. హాలివుడ్‌లోకి అడుగుపెట్టింది. అటు మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ తన సత్తా చాటింది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరా అని అనుకుంటున్నారా.? పైన ఫోటోలోని చిన్నారిని చూశారా.? ఇప్పటికైనా గుర్తొచ్చిందా.. ఆమెవరో.. ఇంకా కనిపెట్టలేకపోయారా.? మీకో క్లూ.. ఆ హీరోయిన్.. హాలీవుడ్ హీరోను పెళ్ళాడింది. అతడు మరెవరో కాదు.. నిక్ జోనాస్. హా.! ఎస్.. మీరనున్నది కరెక్టే.. ఆ బ్యూటీ మరెవరో కాదు ప్రియాంక చోప్రా.
‘తమిజాన్’ అనే తమిళ చిత్రంతో తన కెరీర్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా.. ఆ తర్వాత ‘ది హీరో’తో బీ-టౌన్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా అనంతరం వరుసపెట్టి హిందీలో అవకాశాలు దక్కించుకుంది. తన కెరీర్‌లో ‘ఐత్రాజ్’, ‘వక్త్’, ’36 చైనా టౌన్’, ‘క్రిష్’, ‘డాన్’, ‘ఓం శాంతి ఓం’, ‘ఫ్యాషన్’ వంటి సూపర్ హిట్ చిత్రాలను హిందీలో.. అలాగే ఇంగ్లీష్‌లో ‘బేవాచ్’, ‘ఎ కిడ్ లైక్ జేక్’, ‘స్కై ఇస్ పింక్’, ‘మాట్రిక్స్’ లాంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. కాగా, ప్రస్తుతం ప్రియాంక ఇంగ్లీష్‌లో ‘లవ్ అగైన్’ సినిమా నటిస్తోంది.