AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: బన్నీ- మంచు విష్ణుతో ఉన్న ఈ కుర్రాడిని గుర్తుపట్టారా..? ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్..

పై ఫోటోలో బన్నీ- మంచు విష్ణుతో కనిపిస్తున్న ఈ కుర్రాడు ఇప్పుడు బుల్లితెర టాప్ హీరోల్లో ఒకరు. సినిమాల్లో అప్పుడెప్పుడో చేశాడు. ఇప్పుడు సీరియల్స్, వెబ్ సిరీస్‌లలో అదరగొడుతున్నాడు. తనెవరో మీరు గుర్తుపట్టారా..?

Tollywood: బన్నీ- మంచు విష్ణుతో ఉన్న ఈ కుర్రాడిని గుర్తుపట్టారా..? ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్..
Tollywood Heros
Ram Naramaneni
|

Updated on: Oct 24, 2024 | 12:20 PM

Share

చైల్డ్ ఆర్టిస్టులు.. హీరో హీరోయిన్లుగా ఎంట్రీలు ఇవ్వడం ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో బాగా చూస్తున్నాం. వెండితెర మీద మాత్రమే కాదు.. బుల్లితెర మీద కూడా వారి హవానే ఎక్కువగా ఉంది. పలు సినిమాల్లో అలరిస్తూ దూసుకుపోతున్నారు. మంచి ఫ్యాన్ బేస్ కూడా సెట్ చేసుకుంటున్నారు. పైన ఫోటోలో ఉన్న అబ్బాయిని గుర్తుపట్టారా..? తను ఇప్పుడు ఆర్టిస్ట్‌గా దూసుకుపోతున్నాడు. పై ఫోటోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మంచు విష్ణు చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని తీసుకుంటున్న ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ప్రస్తుతం ఈ కుర్రాడు నటుడిగా మారి పలు చిత్రాల్లో, వెబ్ సిరీస్‌లలో, సీరియల్స్‌లో హీరోగా అలరిస్తున్నాడు. పైగా ఇతగాడికి ఫ్యాన్ ఫ్యాలోయింగ్ కూడా భారీగా ఉంది. ఇంతకీ ఎవరో కనిపెట్టారా..

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ కుర్రాడు ఇప్పుడు బుల్లితెర టాప్ స్టార్లలో ఒకడు. అంతేకాకుండా.. ఈ కుర్రోడు ఇప్పుడు పలు సినిమాల్లో, వెబ్ సిరీస్‌లలోనూ తన తమ మార్క్ చూపిస్తున్నాడు. అతడు మరెవరో కాదు… బుల్లితెర హీరో ‘మానస్ నాగులపల్లి’. ఈయన ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న సీరియల్ ‘బ్రహ్మముడి’లో హీరోగా అలరిస్తున్నాడు. ఇక ఈ హీరోకి అమ్మాయిల ఫాలోయింగ్ నెక్ట్స్ లెవల్‌లో ఉంది. మానస్ చైల్డ్ ఆర్టిస్టుగా కూడా చేశాడు. ఈ క్రమంలోనే.. మానస్ మొదటిగా 2004లో మహేష్ బాబు, శ్రియ జంటగా నటించిన ‘అర్జున్’ సినిమాలో బాలనటుడిగా వెండితెరకు పరిచయమైయ్యాడు. ఇక ఈ సినిమా తర్వత వీడే, నరసింహనాయుడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. ఆ తర్వాత.. వెండితెరపై 2015లో హీరోగా ‘ఝలక్’  మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఫస్ట్ సినిమాతోనే మంచి నటుడిగా మార్కులు వేసుకున్న మానస్ ఆ తర్వాత కాయ్ రాజా కాయ్, అతను, కై రాజా కై, ప్రేమికుడా, గోలి సోడా, మొదలైన చిత్రాల్లో నటించాడు. ఇక వెండితెరపై అలరించిన మానస్ ఆ తర్వాత బుల్లితెరకు వచ్చి.. భలే ఛాన్సులే, కోయిలమ్మా, కార్తీకదీపం వంటి ధారావాహికల్లో అలరించాడు. దీని తర్వాత తెలుగు బిగ్ బాస్ సీజన్ 5లో కూడా ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్స్ బేస్ పెంచుకున్నాడు.

ఇటీవలే మాన్షన్ అనే వెబ్ సిరీస్‌లో కూడా మానస్ అలరించాడు. గత ఏడాది ఈ హీరో ఒక ఇంటివాడు అయ్యాడు. 2023 నవంబర్ 22న శ్రీజ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తూ.. మరోవైపు ప్రొఫిషినల్‌గా కూడా మంచిగా రాణిస్తున్నాడు మానస్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ములక్కాడ గుజ్జు కర్రీ.. అన్నం, చపాతీల్లోకి టేస్ట్ అదిరిపోతోంది
ములక్కాడ గుజ్జు కర్రీ.. అన్నం, చపాతీల్లోకి టేస్ట్ అదిరిపోతోంది
మెట్రోలో సాంకేతిక సమస్య.. ఆ రూట్‌లో రాకపోకలకు అంతరాయం!
మెట్రోలో సాంకేతిక సమస్య.. ఆ రూట్‌లో రాకపోకలకు అంతరాయం!
మాల్దీవులు కాదు..అందమైన డంపింగ్ యార్డ్.. షుటింగ్స్‌తో బిజీబిజీ
మాల్దీవులు కాదు..అందమైన డంపింగ్ యార్డ్.. షుటింగ్స్‌తో బిజీబిజీ
ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే
ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే
ఈ టాలీవుడ్ నటుడు మొన్నటివరకు HYD ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్
ఈ టాలీవుడ్ నటుడు మొన్నటివరకు HYD ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలన్నట్టుంది..
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలన్నట్టుంది..
వాడు ఆడుతోన్న తీరు చూస్తే వణుకొస్తోంది.. గేల్ కంటే డేంజరస్
వాడు ఆడుతోన్న తీరు చూస్తే వణుకొస్తోంది.. గేల్ కంటే డేంజరస్
పురుషులకు నో ఎంట్రీ! పూర్తిగా మహిళల పాలనలోనే ఈ రైల్వే స్టేషన్..
పురుషులకు నో ఎంట్రీ! పూర్తిగా మహిళల పాలనలోనే ఈ రైల్వే స్టేషన్..
కొత్త ఆదాయపు పన్ను విధానం! CTCపై పన్ను..?
కొత్త ఆదాయపు పన్ను విధానం! CTCపై పన్ను..?
పక్కా మాస్ సాంగ్.. యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
పక్కా మాస్ సాంగ్.. యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..