Tollywood: బాబోయ్.. ఈ చిచ్చరపిడుగు ఆ స్టార్ హీరోయినా .. ! సింగర్‏గా అదరగొట్టేసిన ఈ చిన్నారిని గుర్తుపట్టగలరా..

|

May 01, 2024 | 12:19 PM

కేవలం 19 ఏళ్ల వయసులోనే మలయాళీ స్టార్ నటుడిని పెళ్లి చేసుకుని.. ఇప్పటికీ సినిమాల్లో కథానాయికగా కొనసాగుతుంది. తాజాగా ఈ హీరోయిన్ చిన్ననాటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అందులో ఎంతో అద్భుతంగా పాట పాడుతూ అదరగొట్టేసింది. పైన ఫోటోను చూశారు కదా.. తను ఎవరో గుర్తుపట్టారా ?.. ఆ చిచ్చరపిడుగు ఎవరో కాదండి..

Tollywood: బాబోయ్.. ఈ చిచ్చరపిడుగు ఆ స్టార్ హీరోయినా .. ! సింగర్‏గా అదరగొట్టేసిన ఈ చిన్నారిని గుర్తుపట్టగలరా..
Actress
Follow us on

సౌత్ ఇండస్ట్రీలో ఒకే ఒక్క సినిమాతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది ఓ హీరోయిన్. మలయాళంలో అనేక సినిమాల్లో నటించిన ఆ బ్యూటీకి తెలుగు, తమిళం భాషలలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. తనదైన నటనతో దక్షిణాది క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ చిన్న వయసులోనే తన సహనటుడిని ప్రేమ వివాహం చేసుకుంది. కేవలం 19 ఏళ్ల వయసులోనే మలయాళీ స్టార్ నటుడిని పెళ్లి చేసుకుని.. ఇప్పటికీ సినిమాల్లో కథానాయికగా కొనసాగుతుంది. తాజాగా ఈ హీరోయిన్ చిన్ననాటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అందులో ఎంతో అద్భుతంగా పాట పాడుతూ అదరగొట్టేసింది. పైన ఫోటోను చూశారు కదా.. తను ఎవరో గుర్తుపట్టారా ?.. ఆ చిచ్చరపిడుగు ఎవరో కాదండి.. హీరోయిన్ నజ్రియా నసీమ్.

సౌత్ ఇండియన్ ప్రేక్షకుల అభిమానాన్ని దోచుకున్న హీరోయిన్ ఈ బ్యూటీ. రాజా రాణి సినిమాతో దక్షిణాదిలో సూపర్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. నజ్రియా చైల్ట్ ఆర్టిస్ట్. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటిస్తుంది. విదేశాల్లో పుట్టి పెరిగిన నజ్రియా చిన్నతనంలోనే టెలివిజన్ షోల పాల్గొంది. ఆ తర్వాత కథానాయికగా వెండితెరపై అలరిస్తుంది. నజ్రియా పాత వీడియో ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. బేబీ నజ్రియా చాలా ఆనందంగా మాపిలాపాట పాడుతున్న వీడియోలో కనిపిస్తుంది.

బాలనటిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. పెళ్లి తర్వాత నాలుగేళ్లు విరామం తీసుకున్న నజ్రియా.. అంజలీ మీనన్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో న్యాచురల్ స్టార్ నాని జోడిగా అంటే సుందరానికి సినిమాలో నటించింది. ఇటు హీరోయిన్ గానే కాకుండా అటు నిర్మాతగానూ రాణిస్తుంది. వ‌ర‌త‌న్, కుంబ‌ళంగి నైట్స్, సీ యు సూన్ వంటి చిత్రాలను నిర్మించింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీలో కీలకపాత్ర పోషిస్తున్న ఫహద్ ఫాజిల్ ను నజ్రియా ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప జన్మించింది.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.