
ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకోవడం అంటే అంత సులభం కాదు. చాలా మంది హీరోయిన్ ఎన్నో సినిమాల్లో నటించి తమ నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న తర్వాత క్రేజ్, పాపులారిటీ సొంతం చేసుకున్నారు. కానీ కొంతమంది మాత్రం ఓవర్ నైట్ లో ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. అందులో ఈ అమ్మడు కూడా ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినా యమా పాపులారిటీ సొంతం చేసుకుంది ఆమె. పైన కనిపిస్తున్న చిన్నారుల్లో ఓ అందాల భామ ఉంది ఎవరోకనిపెట్టారా.? ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండదు. ముట్టుకుంటే కందిపోయే ఆ ముద్దుగుమ్మ తన సోయగంతో ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా ఇంతకు ఆ అమ్మడు ఎవరో కనిపెట్టారా.?
పై ఫొటోలో ఉన్న చిన్నారుల్లో ఉన్న హీరోయిన్ ఎవరో కనిపెట్టడం చాలా కష్టమే కానీ ఆమె మరెవరో కాదు హాట్ బ్యూటీ హనీ రోజ్. మలయాళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఈ సినిమాలో ఆమె రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించింది.
ఇక ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచినాకూడా హనీ రోజు కు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేస్తుంది ఈ భామ. అలాగే చిరంజీవి నటిస్తున్న విశ్వంభరలో నటిస్తుందని టాక్ వినిపిస్తుంది కానీ దీనిపై క్లారిటీ లేదు. ఇక సోషల్ మీడియాలో అభిమానులతో రెగ్యులర్ గా టచ్ లో ఉండే హనీ .. తన హాట్ హాట్ ఫొటోలతో కవ్విస్తుంది. సినిమాలతో కంటే షాపింగ్ మాల్స్ ఓపినింగ్స్ తోనే ఎక్కువ గడిపేస్తుంది ఈ చిన్నది. ఇక హనీ రోజ్ అందాలకు ఫిదా కాని కుర్రళ్ళుండరు.
Honey Rose
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.