
బుల్లితెరపై తన గ్లామర్‌తో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తోన్న అనసూయ..వెండితెరపై కూడా సెలక్టీవ్ గా సినిమాలు చేస్తోంది. న్యూస్ రీడర్‌గా కెరియర్ ప్రారంభించి.. ఆ తర్వాత టీవీ షోలతో పాపులారిటీ సంపాదించి..ఇప్పుడు నటిగా కూడా అంతే స్థాయిలో దుమ్మురేపుతోంది. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలో నాగ్ కి మరదలుగా… ‘రంగస్థలం’ చిత్రంలో రంగమ్మత్తగా నటించి మంచి మార్కులు కొట్టేసిన అనసూయ ఇప్పుడు చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’లో నటిస్తున్నట్టు తెలుస్తుంది.
ఇప్పటి వరకు టాలీవుడ్‌కే పరిమితమైన అనసూయకి బాలీవుడ్ నుండి బంపర్ ఆఫర్ వచ్చినట్టు సమాచారం. అయితే అది సినిమాలో కాదులేంది. హిందీలో టాప్ రేటింగ్‌తో దూసుకెళుతున్న సీరియల్‌లో ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర కోసం అనసూయని అడిగారట. బాలీవుడ్‌లో చాలామంది నటీ నటులు సీరియల్స్ నుంచి వెండితెరపైకి మళ్లినవారే. సీరియల్‌లో నటించేందుకు తక్కువ రోజులే డేట్స్ అడగడం..అందునా ప్రాముఖ్యత ఉన్న పాత్ర కావడంతో.. ఈ ఆఫర్ కి అనసూయ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే దీనిపై ఆమె నుంచి స్పష్టత రావాల్సి ఉంది.