
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. తన మేనల్లుడు సాయి తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న వినోదయ సీతమ్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలుగా నటించారు. విడుదలకు ముందే మెగా ఫ్యాన్స్ చేసిన రచ్చ గురించి చెప్పక్కర్లేదు. ఇక భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా హిట్ కావడంతో తాజాగా మేకర్స్ బ్రో సినిమా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. మెగా అభిమానులకు చిత్రబృందం సర్ ప్రైజ్ ఇస్తూ విడుదల చేసిన ఈ వీడియో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సెట్ లో పవన్, సాయి తేజ్ జోష్ ఆకట్టుకుంటుంది.
అలాగే ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. అంతేకాకుండా మొదటి నుంచి ఈ మూవీ వర్క్స్ దగ్గరుండి చూసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బ్రో మేకింగ్ వీడియో ఆకట్టుకుంటుంది. ఇక తమన్ అందించిన మ్యూజిక్ తోపాటు.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఇక బ్రో మూవీ భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ దాదాపు రూ. 100 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.