
ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి హాస్య బ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు బ్రహ్మానందం. ఎన్నో సినిమాల్లో రకరకాల పాత్రలు చేసి మెప్పించారు. కమెడియన్ గా తన నటనతో పేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు బ్రహ్మానందం. హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్నారు బ్రహ్మానందం. అంతే కాదు హీరోల కంటే బ్రహ్మానందానికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమ సినిమాల్లో బ్రహ్మానందం ఉండాలని చాలా మంది హీరోలు కోరుకుంటారు. అసలు హీరోల కంటే బ్రహ్మానందాన్ని చూడటానికే సినిమాకు వెళ్లే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారిన బ్రహ్మానందం.. ఇప్పుడు సినిమాలు తగ్గించారు. కానీ అడపాదడపా సినిమాలు చేసి మెప్పిస్తున్నారు.
ఇటీవలే కొడుకుతో కలిసి బ్రహ్మ ఆనందం అనే సినిమాలో నటించారు. సోషల్ మీడియాలో బ్రహ్మానందంకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో బ్రహ్మానందం మీమ్ గాడ్ గా పిలుచుకుంటుంటారు. మీమ్స్ లో బ్రహ్మానందం లేకుండా ఒక్క ఫోటో కూడా ఉండదు. తాజాగా బ్రహ్మానందంకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఇప్పుడు కుర్రాళ్లందరూ నన్ను ఫాలో అవుతున్నారు అని అన్నారు మీమ్స్ గాడ్.
ఓ సినిమా ఈవెంట్ లో బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఒకప్పుడు నేను చేసిన అరగుండు ఇప్పుడు ఫ్యాషన్ అయ్యింది. అప్పటి నా హెయిర్ స్టైల్ యూ ఇప్పుడు అందరూ చేయించుకుంటున్నారు.. ఇప్పుడు కుర్రాళ్లందరూ నన్ను ఫాలో అవుతున్నారు.. నాకు గర్వంగా ఉంది అని ఫన్నీగా కామెంట్స్ చేశారు బ్రహ్మానందం. ఈ వీడియ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.