Serial Actress : తినడానికి తిండి లేదు.. రక్తం అమ్ముకొని బతికాను.. సీరియల్ హీరోయిన్ కన్నీళ్లు..

ఈరోజుల్లో సీరియల్ తారలకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. చిన్న చిన్న పాత్రలు పోషించిన నటీనటులు సైతం సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంటున్నారు. అయితే ఓ సీరియల్ నటి మాత్రం ఒకప్పుడు తినడానికి తిండి లేక రక్తం అమ్ముకుని బతికానంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

Serial Actress : తినడానికి తిండి లేదు.. రక్తం అమ్ముకొని బతికాను.. సీరియల్ హీరోయిన్ కన్నీళ్లు..
Nainisha Rai

Updated on: Dec 25, 2025 | 9:51 AM

ప్రస్తుతం బుల్లితెరపై మంచి ఫాలోయింగ్ ఉన్న సీరియల్ తారలు చాలా మంది ఉన్నారు. నిత్యం తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సీరియల్స్ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నప్పటికీ నిజ జీవితంలో అనేక కష్టాలు అనుభవించినవారు చాలా మంది ఉన్నారు. కెరీర్ తొలినాళ్లల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తూ తినడానికి తిండి లేక ఇబ్బందిపడినవారు ఉన్నారు. అయితే ఓ సీరియల్ నటి మాత్రం బతకడానికి రక్తం అమ్ముకున్నానంటూ చెప్పుకొచ్చింది. ఆమె మరెవరో కాదు.. నైనీషా రాయ్. ఈ పేరు చెబితే గుర్తుపట్టకపోవచ్చు కానీ.. బ్రహ్మాముడి ఫేమ్ అప్పు అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ సీరియల్లో తన క్యూట్ నటనతో ఆకట్టుకుంటుంది. బెంగాలీ అమ్మాయి అయినప్పటికీ అచ్చమైన తెలుగమ్మయిలా కనిపిస్తూ అభిమానులను సంపాదించుకుంది. అయితే నటిగా అవకాశాలు రాకముందు ఎన్నో కష్టాలు పడిందట.

గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నైనీషా మాట్లాడుతూ.. తనకు కెరీర్ మొదట్లో తినడానికి తిండి కూడా లేదని తెలిపింది. ఒక సమయంలో ఆకలి తీర్చుకోవడానికి తన రక్తాన్ని అమ్ముకోవాల్సి వచ్చిందని.. అలా కష్టాలతో నెట్టుకోస్తున్న సమయంలోనే ఆఫర్స్ వచ్చాయని తెలిపింది. కానీ ఆఫర్స్ ఇస్తే మాకేంటీ అని అడిగేవారని.. కమిట్మెంట్ కండీషన్స్ పెట్టేవారని తెలిపింది. కొన్నిసార్లు బలవంతం పెట్టారని.. అక్కడి నుంచి ఎలాగోలా బయటకు వచ్చినట్లు తెలిపింది.

ఒకానొక సమయంలో చనిపోదామని అనుకున్నానని.. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో.. మరిన్ని ఆఫర్స్ వచ్చినట్లు తెలిపింది. ప్రస్తుతం బ్రహ్మాముడి సీరియల్ ద్వారా నైనీషాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు వచ్చింది.

ఇవి కూడా చదవండి :  Bigg Boss 9 Telugu : ఆ ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన కళ్యాణ్.. తనూజ గురించి ఆసక్తికర కామెంట్స్..