Box Office: అంచనాలు లేని సంచలనం.. ‘పుష్ప 2’ రికార్డు బ్రేక్ చేసిన బాలీవుడ్ స్పై యాక్షన్ సినిమా!

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత భారీ అంచనాల నడుమ రిలీజై రికార్డులు సృష్టించిన సినిమా అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్'. ఈ సినిమా విడుదల కాకముందే రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు బలంగా నమ్మాయి. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ పాన్​ఇండియా ..

Box Office: అంచనాలు లేని సంచలనం.. పుష్ప 2 రికార్డు బ్రేక్ చేసిన బాలీవుడ్ స్పై యాక్షన్ సినిమా!
Pushpa2 And Bollywood Movie

Updated on: Dec 14, 2025 | 11:04 AM

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత భారీ అంచనాల నడుమ రిలీజై రికార్డులు సృష్టించిన సినిమా అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’. ఈ సినిమా విడుదల కాకముందే రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు బలంగా నమ్మాయి. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ పాన్​ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించి బ్లాక్​బస్టర్​ హిట్​గా నిలిచింది. అయితే, బాలీవుడ్ నుంచి తాజాగా విడుదలైన ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్.. ‘పుష్ప 2’ను అధిగమించి బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డును సృష్టించింది. రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా సంచలన కలెక్షన్లతో దూసుకుపోతూ, ‘పుష్ప 2’ హిందీ వెర్షన్ సెకండ్ ఫ్రైడే కలెక్షన్లను బ్రేక్ చేసింది.

Pushpa2 And Dhurandhar

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ సీక్రెట్ ఏజెంట్‌గా నటించిన ‘ధురంధర్’ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ విడుదలైన రెండో శుక్రవారం రోజున అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ప్రముఖ సినీ విశ్లేషకుల నివేదికల ప్రకారం, ‘ధురంధర్’ రెండో శుక్రవారం నాడు సాధించిన కలెక్షన్లు.. అప్పటి వరకు రికార్డు సృష్టించిన ‘పుష్ప 2’ హిందీ వెర్షన్ రెండో శుక్రవారం కలెక్షన్ల కంటే ఎక్కువగా ఉన్నాయి.

‘పుష్ప 2’ (హిందీ) రెండో శుక్రవారం రూ.27.50 కోట్లు, ‘ధురంధర్’ రెండో శుక్రవారం ఈ మొత్తం కంటే ఎక్కువ వసూలు చేసి కొత్త రికార్డు సృష్టించింది. ఇది మాత్రమే కాక, ఈ సినిమా ‘ఛావా’ రూ.24.03 కోట్లు, ‘యానిమల్’ రూ.23.53 కోట్లు వంటి భారీ హిట్ల రెండో శుక్రవారం కలెక్షన్లను కూడా అధిగమించడం విశేషం. ‘ధురంధర్’ సినిమాకు ఉన్న పాజిటివ్ టాక్, బలమైన కథనం కారణంగా ఈ వసూళ్లు సాధ్యమయ్యాయి. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థలను అంతమొందించేందుకు భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చేపట్టిన రహస్య ఆపరేషన్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.


ఇందులో రణ్‌వీర్ సింగ్‌తో పాటు మాధవన్ ఐబీ చీఫ్‌గా, అక్షయ్ ఖన్నా విలన్‌గా నటించారు. బాలీవుడ్ ఫ్యాన్స్ ఈ సినిమా విజయాన్ని చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే జోరు కొనసాగితే, ‘ధురంధర్’ త్వరలోనే రూ.500 కోట్ల మార్కును కూడా అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా విజయం బాలీవుడ్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చి, సౌత్ సినిమాలతో గట్టి పోటీని ఇస్తోందని నిరూపించింది.