Salman Khan: ఇదేందయ్యా..! సల్మాన్ ఖాన్ ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

|

Dec 27, 2024 | 9:46 AM

ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ .. సందర్భమేదైనా సల్మాన్ ఖాన్ ఎప్పుడూ స్టైలిష్‌గా కనిపిస్తుంటాడు. దుస్తులతో పాటు అతను ధరించే వాచ్ లు, బ్రేస్ లెట్స్ ఎప్పుడూ స్పెషల్ గానే ఉంటాయి. ముఖ్యంగా సల్మాన్‌ ఖాన్‌ తరచూ ఖరీదైన వాచ్‌లతో కనిపిస్తుంటాడు. అందులోనూ వజ్రాలు పొదిగిన వాచీలు అంటే సల్మాన్‌కు చాలా ప్రీతి.

Salman Khan: ఇదేందయ్యా..! సల్మాన్ ఖాన్ ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Salman Khan
Follow us on

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పుట్టినరోజు నేడు. సల్మాన్ కు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు విషెస్ తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 59 ఏళ్లు. ‘బీవీ హో తో ఏసీ’ సినిమాలో చిన్న పాత్రతో పరిచయం అయ్యాడు సల్మాన్. అయితే ‘మేనే ప్యార్ కియా’ సినిమా ఆయనకు విజయాన్ని అందించింది. బుల్లితెరలో కూడా నటించాడు సల్మాన్. ఇప్పుడు సల్మాన్ బాలీవుడ్ లో తోపు హీరో. సల్మాన్ ఖాన్‌కు ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ ఉంది. అతని నికర విలువ రూ. 2900 కోట్ల రూపాయలు. సల్మాన్ ఖాన్ హీరోగానే కాదు.. చాలా బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా ఉన్నారు.

బీయింగ్ హ్యూమన్’ బ్రాండ్ సల్మాన్ ఖాన్ సొంత బ్రాండ్. అతను 2013 లో ఈ బ్రాండ్‌ను ప్రారంభించాడు. దీని ద్వారా సల్మాన్ చారిటబుల్ ట్రస్ట్‌కు సహాయం చేస్తున్నాడు. దీని ద్వారా ఎంతో మందికి సాయం అందించాడు సల్మాన్. కాగా  సల్మాన్‌ఖాన్‌ ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెడతాడు. అతను ఫిట్‌నెస్ సెంటర్స్ కూడా ప్రారంభించాడు. ఇది భారతదేశం అంతటా 300 కంటే ఎక్కువ బ్రాంచ్ లు ఉన్నాయి. సల్మాన్ ఖాన్ అనేక బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నాడు. దీని కోసం వారు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నాడు. సల్మాన్‌ఖాన్‌కి ‘సల్మాన్‌ఖాన్‌ ఫిలిమ్స్‌’ అనే పేరుతో సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఈ బ్యానర్ పై ‘బజరంగీ భాయిజాన్’, ‘రేస్ 3’, ‘ట్యూబ్‌లైట్’, ‘భారత్’ వంటి చిత్రాలను నిర్మించాడు.

సల్మాన్ ఖాన్ చాలా రంగాల్లో పెట్టుబడులు పెట్టారు.  ముంబైలోని బాంద్రాలో సల్మాన్‌ఖాన్‌కు గెలాక్సీ అపార్ట్‌మెంట్ ఉంది. దీని ధర దాదాపు 100-150 కోట్ల రూపాయలు. అలాగే 150 ఎకరాల ఫామ్‌హౌస్ ఉంది. పన్వేల్‌లో ‘అర్పిత ఫామ్స్’ పేరుతో ఒక ఫామ్‌హౌస్ ఉంది. ఇది ముంబై శివార్లలో ఉంది. ఇది అతని అత్యంత ఖరీదైన పెట్టుబడులలో ఒకటి. సమయం దొరికినప్పుడల్లా ఇక్కడికి వెళ్తుంటాడు సల్మాన్. సల్మాన్ ఖాన్ ముంబైలోని గోరాయ్‌లో 100 కోట్ల రూపాయల విలువైన బీచ్‌సైడ్ ఇల్లు కొన్నాడు. ఇది జిమ్, థియేటర్, స్విమ్మింగ్ పూల్‌తో కూడిన ఐదు పడక గదుల ఇల్లు. అలాగే  దుబాయ్‌లో బుర్జ్ పసిఫిక్ టవర్లు ఉన్నాయి. అదేవిధంగా సల్మాన్ ఖాన్ కు రియల్ ఎస్టేట్ అంటే చాలా ఆసక్తి. ముంబైలోని లింకింగ్ రోడ్‌లో 120 కోట్ల రూపాయలతో ఓ ప్రాపర్టీని కొనుగోలు చేశాడు. సల్మాన్ ఖాన్ దగ్గర ఖరీదైన కార్లు ఉన్నాయి. ప్రస్తుతం సల్మాన్ బుల్లెట్ ప్రూఫ్ కారులో తిరుగుతున్నాడు. సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ‘సిఖందర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ‘టైగర్ వర్సెస్ పఠాన్’ సినిమాలో నటించాల్సి ఉంది. అట్లీతో కూడా ఓ సినిమా చేస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి