Neha Kakkar: విడాకుల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సింగర్ నేహా కక్కర్

గాయని నేహా కక్కర్ బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే. బుల్లి తెరపై ఈ అందాల సింగర్ బాగానే సందడి చేస్తుంది.ఇక నేహా కక్కర్ వ్యక్తిగత జీవితం గురించి గత కొన్ని రోజులుగా నిరంతరం వార్తల్లో నిలుస్తుంది . అంతే కాదు నేహా కక్కర్ కూడా గత కొన్ని రోజులుగా బుల్లితెరకు దూరంగా ఉంది.

Neha Kakkar: విడాకుల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సింగర్ నేహా కక్కర్
Neha Kakkar

Updated on: Feb 27, 2024 | 6:59 PM

సినీ ఇండస్ట్రీలోప్రేమలు, బ్రేకప్ లు, పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్ అయ్యాయి. బాలీవుడ్ ఈ తంతు ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే చాలా మంది పెళ్లి మీటలెక్కితే కొంతమంది విడిపోతున్నట్టు తెలిపి ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్నారు. రీసెంట్ గా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ స్టార్ సింగర్ విడాకుల పై పెద్ద ప్రకటనే చేసింది. గాయని నేహా కక్కర్ బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే. బుల్లి తెరపై ఈ అందాల సింగర్ బాగానే సందడి చేస్తుంది.ఇక నేహా కక్కర్ వ్యక్తిగత జీవితం గురించి గత కొన్ని రోజులుగా నిరంతరం వార్తల్లో నిలుస్తుంది . అంతే కాదు నేహా కక్కర్ కూడా గత కొన్ని రోజులుగా బుల్లితెరకు దూరంగా ఉంది. నేహా కక్కర్ కూడా తన జీవితంలో  పెద్ద సవాల్ ను ఎదుర్కొన్నట్లు బీటౌన్ లో టాక్ వినిపిస్తుంది. నేహా కక్కర్ 2022లో ఇండియన్ ఐడల్ షోలో న్యాయనిర్ణేతగా కనిపించింది. ఆతర్వాత తిరిగి స్క్రీన్ మీద కనిపించలేదు.

రోహన్‌ప్రీత్ సింగ్ , నేహా కక్కర్ విడాకులు తీసుకోనున్నారని కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా నేహా కక్కర్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో నేహా కక్కర్ చాలా విషయాలు బయట పెట్టింది. నేహా కక్కర్ తన వ్యక్తిగత జీవితం గురించి కూడా చెప్పుకొచ్చింది. నేహా కక్కర్ మాట్లాడుతూ.. నేను చాలా చిన్న వయస్సులోనే పని చేయడం ప్రారంభించాను. నేను ఏ పని చేసినా 100 శాతం ఇస్తాను. చాలా ఏళ్లుగా షోలు చేస్తున్నాను.

ఇప్పుడు నాకు విరామం అవసరం. నేను చాలా అలసిపోయాను, కాబట్టి నేను విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను వివాహం చేసుకున్నప్పటి నుంచి, నా విడాకులు, గర్భం గురించి రకరకాల వార్తలు వచ్చాయి. నేను ఈ విషయాలన్నింటినీ విస్మరిస్తున్నాను. నేను ఈ విషయాలను పట్టించుకోను. ఎందుకంటే ఏది నిజమో ఏది కాదో నాకు తెలుసు. నేను మానసికంగా, శారీరకంగా అలసిపోయాను, కాబట్టి నేను విరామం తీసుకుంటున్నాను. ఇప్పుడు పూర్తి శక్తితో తిరిగి రాబోతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. నేహా కక్కర్, రోహన్‌ప్రీత్ సింగ్ 2021లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం జరిగి 3 సంవత్సరాలు అయ్యింది. నేహా కక్కర్, రోహన్‌ప్రీత్ మధ్య మనస్పర్థలు వచ్చాయని వారు త్వరలో విడాకులు తీసుకోనున్నట్లు కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు చివరకు నేహా కక్కర్ దీని గురించి నేరుగా మాట్లాడటం తో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

నేహా కక్కర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.