బాలీవుడ్ సినిమాలకు, సౌత్ ఇండియన్ సినిమాలకు చాలా తేడా ఉంటుంది. గతంలో చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. సౌత్ వర్సెస్ నార్త్ చాలా కాలం క్రితమే జరిగింది. రీసెంట్ గా కల్కి సినిమా పై బాలీవుడ్ నటుడు చేసిన కామెంట్స్ పై టాలీవుడ్ మండిపడుతోంది. ఆ బాలీవుడ్ నటుడికి కౌంటర్లు కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ సినిమాల పై కాంతార హీరో నేషనల్ అవార్డు విన్నర్ రిషబ్ శెట్టి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా రిషబ్ శెట్టి ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రమోద్ శెట్టి కథానాయకుడిగా రిషబ్ శెట్టి నిర్మించిన ‘లాఫింగ్ బుద్ధా’ చిత్రం ఈ వారం విడుదలవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం రిషబ్ పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.
తాజాగా రిషబ్ జాతీయ అవార్డు అందుకున్నాడు. ‘కాంతార’ సినిమాలో నటనకు గానూ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు. దీంతో ఆయన పాపులారిటీ మరింత పెరిగింది. రిషబ్ సాధించిన ఘనత ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. మంచి సినిమాలను అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా రిషబ్ బాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడాడు.
“కొన్ని సినిమాలు, ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలు భారతదేశాన్ని చెడుగా. తక్కువ చేసి చూపిస్తున్నాయి.మన సినిమాలకు విదేశాల్లో గ్లోబల్ ఈవెంట్, రెడ్ కార్పెట్‌లకు ఆహ్వానం అందుతుంది. అలాంటి మన దేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారు.మన దగ్గర ఉన్నదాన్ని సానుకూలంగా చూపించడం లేదు. నా దేశం.. , నా రాష్ట్రం.., నా భాష.. గురించి ప్రపంచానికి గొప్పగా చెప్పాలనుకుంటున్నా” అని ఆయన అన్నారు. రిషబ్ శెట్టి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారింది. రిషబ్ కామెంట్స్‌కు కొందరు మద్దతు తెలుపుతున్నారు. రిషబ్ శెట్టి సరైన రీతిలో మాట్లాడాడని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. రిషబ్ శెట్టి కూడా నటన, దర్శకత్వం అలాగే నిర్మాణంలో బిజీగా ఉన్నాడు. కొత్త హీరోల సినిమాలను నిర్మిస్తున్నాడు. రిషబ్ శెట్టి ప్రస్తుతం ‘కాంతార: చాప్టర్ 1’తో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
RISHAB SHETTY: Indian films, especially Bollywood shows India in a Bad light, touted as art films, getting invited to global event, red carpets.
My nation, My state, My language-MY PRIDE, why not take it on a +ve note globally & that’s what I try to do.
— Christopher Kanagaraj (@Chrissuccess) August 20, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.