Boney Kapoor : ఒకే రోజు రెండు భారీ సినిమాలు రిలీజ్.. అసహనం వ్యక్తం చేసిన బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్..

|

Feb 12, 2021 | 3:14 AM

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ క‌పూర్ కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. చిత్రనిర్మాణంలో గొప్ప నిర్మాతగా పేరుగాంచిన బోనీ కపూర్‌ ప్రస్తుతం వరుసగా సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉన్నారు.

Boney Kapoor : ఒకే రోజు రెండు భారీ సినిమాలు రిలీజ్.. అసహనం వ్యక్తం చేసిన బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్..
Follow us on

Boney Kapoor : బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ క‌పూర్ కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. చిత్రనిర్మాణంలో గొప్ప నిర్మాతగా పేరుగాంచిన బోనీ కపూర్‌ ప్రస్తుతం వరుసగా సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాకు కూడా బోణి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బోనీ కపూర్‌ ఇప్పుడు నటుడిగా కెమెరా ముందుకు రాబోతున్నారు. ఇటీవ‌ల నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌లైన ఏకె వర్సెస్ ఏకె చిత్రంలో అతిథి పాత్ర‌లో న‌టించి విమర్శకుల ప్రశంసలు పొందారు. అలాగే బోనీ లవ్ రంజన్ అనే సినిమాకు సంతకం చేసాడు. ఈ కామెడీ ఎంటర్టైనర్ లో బోని ఫుల్ లెన్త్ పాత్రలో కనిపించనున్నాడట.

అయితే బోని కపూర్ నిర్మాతగా వ్యవహరించిన మైదాన్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్ హీరో. ఈ ఏడాది అక్టోబర్ 15న మైదాన్ సినిమా విడుదల కానుంది. అయితే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కూడా అదే నెలలో అంటే అక్టోబర్ 13న విడుదలవుతోంది. ఈ విషయంలో బోని కాస్త నిరాశతో ఉన్నారట. అయితే ఆర్ ఆర్ ఆర్ లో కూడా అజయ్ దేవగన్ నటిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బోనీ మాట్లాడుతూ ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ విని షాక్ ఆయా. నిజానికి మైదాన్ రిలీజ్ డేట్ అన్ని సెట్ అయినతరువాత అనౌన్స్ చేసాం.. ఇలా అదే రోజు రాజమౌళి సినిమా తీసుకురావడం సరైనది కాదు అని ఆయన అన్నారు. అయితే ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ విషయం రాజమౌళి తనచేతిలో లేదని నిర్మాతనే నిర్ణయించినట్లు చెప్పాడట. దానిని నేను నమ్మను అంటున్నారు బోనీ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

విడుదలకు సిద్దమవుతున్న నితిన్ చెక్ మూవీ… సినిమా నైజాం హక్కులను దక్కించుకుంది ఎవరో తెలుసా..?