Liger Movie Update: విజయ్ దేవరకొండ సరసన మరో బాలీవుడ్ బ్యూటీ.. మరింత హింట్ ఇచ్చిన టాలీవుడ్ ముద్దుగుమ్మ…

|

Mar 23, 2021 | 6:37 PM

Liger Movie Update: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ.. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో

Liger Movie Update: విజయ్ దేవరకొండ సరసన మరో బాలీవుడ్ బ్యూటీ.. మరింత హింట్ ఇచ్చిన టాలీవుడ్ ముద్దుగుమ్మ...
Vijay Devarakonda Liger Mov
Follow us on

Liger Movie Update: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ.. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‏గా నటిస్తుంది. ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌, చార్మి ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మూంబైలో జరుగుతుంది. ఈ చిత్రం తెలుగు, హిందీతో పాటు తమిళం కన్నడ మాలయాళ బాషాల్లో సెప్టెంబర్‌ 9న విడుదల కానున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అంతేకాకుండా ఈ సినిమాలో విజయ్ తల్లిగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తుంది.

ఇదిలా ఉంటే.. ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన మరో బాలీవుడ్ భామా కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ మరో హీరోయిన్‏గా నటించబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలకు.. ఆ మూవీ ప్రోడ్యుసర్.. చార్మి మరింత హింట్ ఇచ్చింది. తాజాగా చార్మీ ఓ ఫోటోను తన ఇన్ స్టాలో షేర్ చేసుకుంటూ.. ఆర్టిస్టులందరినీ ఒక దగ్గరకు చెరిస్తే.. ఇలానే ఉంటుంది అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇందులో డైరెక్టర్ పూరీజగన్నాథ్, విజయ్ దేవరకొండ, కరణ్ జోహార్, ప్రముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ మ‌నీష్ మ‌ల్హోత్రా, ఛార్మీ ఉన్నారు. దీంతో ఈ సినిమాలో సారా కూడా నటిస్తుందన వార్తలకు మారింత బలం చేకూరింది. అయితే ఈ చిత్రంలో సారా పూర్తి నిడివితో కూడిన హీరోయిన్‏ పాత్రలో చేస్తుందా లేకపోతే.. ఓ సాంగ్‏లో మెరవబోతుందా అనే సందేహాలు ఉన్నాయి. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఛార్మీ ఇన్‎స్టాగ్రామ్ ట్వీట్..

Also Read:

Jr.NTR Lakshmi Pranathi: సతీమణి పుట్టినరోజు.. విలువైన కానుక ఇచ్చిన యంగ్ టైగర్.. ఎంటో తెలుసా..

National Film Awards 2020: ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ‘మహర్షి’.. ప్రధానంగా ఈ ఐదు కారణాలే…