
బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌కు ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సల్మాన్ ను ప్రేమించేవారు ఎంతమంది ఉంటారో.. వెతిరేకించే వారు కూడా అంతే మంది ఉంటారు. ఇప్పటికే చాలా మంది సల్మాన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా బాలీవుడ్‌కి చెందిన ఒక మాజీ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్‌ను అబద్దాలకోరు అని కామెంట్స్ చేశారు. ‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమా గురించి మాట్లాడుతూ, ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ అబద్దాలు చెప్తాడని, మోసం చేస్తాడని చెప్పుకొచ్చారు.
‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమా విడుదలై 25 ఏళ్లు అయ్యింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ నటించాడు. కాఫీ విత్ కరణ్ షోలో ఈ సినిమా గురించి సల్మాన్ ఖాన్ గతంలో చేసిన కామెంట్స్ మళ్లీ వైరల్ అయ్యాయి. ఆ రోజు సల్మాన్ ఖాన్ మాటలపై బాలీవుడ్ మాజీ నటుడు చంద్రచూర్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు సల్మాన్ ఖాన్ అబద్దాలకోరు అని అన్నాడు. గతంలో కాఫీ విత్ కరణ్‌పై మాట్లాడిన సల్మాన్ ఖాన్.. “కుచ్ కుచ్ హోతా హై సినిమాలో అమన్ పాత్రలో నటించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కొంతమంది మాటలు విని కరణ్ జోహార్ నా దగ్గరకు వచ్చారు. నేను సైఫ్‌ను అడిగాను, చంద్రచూడ్ సింగ్‌అడిగాను. కానీ వాళ్ళు నాతో సినిమా చేయనున్నారు అని చెప్పారు అని కరణ్ చెప్పాడని అన్నారు సల్మాన్. కరణ్ టాలెంట్‌పై నాకు నమ్మకం ఉండడంతో అమన్ పాత్రలో నటించేందుకు అంగీకరించాను’’ అని సల్మాన్ ఖాన్ అన్నారు.
సల్మాన్ ఖాన్ మాటలను చంద్రచూర్ సింగ్ ఖండించారు. అతను అబద్ధాల కోరు అని అన్నారు. సల్మాన్ ఖాన్ అబద్దాలకోరు అని చంద్రచూడ్ సింగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ.. “నాకు ‘జోష్’, ‘కుక్క; ది ఫైర్’, ‘క్యా కెహనా’, ‘సిల్ సిలా హై ప్యార్ కా’ ఇలా చాలా సినిమాల్లో బిజీగా ఉన్నాను. ‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమాలో నటించడానికి అందుకే ఒప్పుకోలేదు. దాంతో తనకు అప్పట్లో సినిమాలు లేవని సల్మాన్ చెప్పడం అబద్ధమని అన్నారు. ఆ సమయంలో సైఫ్ అలీఖాన్‌కు కూడా సినిమాలు లేవని సల్మాన్ ఖాన్ చెప్పాడు. కానీ ‘కుచ్ కుచ్ హోతా హై’ విడుదలైన ఏడాదిలో సైఫ్ అలీఖాన్ నటించిన నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఇక కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘కుచ్ కుచ్ హోతా హై’. ఆ సినిమాలో షారుఖ్ ఖాన్, కాజల్, రాణి ముఖర్జీ నటించారు. సల్మాన్ ఖాన్ సహాయక పాత్రలో కనిపించాడు.
మరిన్ని ఎంటర్టైమెంట్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..