సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం గురించి చెప్పాల్సిన పనిలేదు (Pushpa). ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కేవలం సినిమానే కాకుండా.. ఇందులో ప్రతి సాంగ్ నెట్టింట్లో రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాపై ప్రేక్షకులే కాదు.. సినీ విశ్లేషకులు సైతం ప్రశంసలు కురిపించారు. తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ డైరెక్టర్ సుకుమార్ పై ప్రశంసలు కురింపించారు. పుష్ప సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని.. అంతేకాకుండా.. నటీనటుల నటన, సంగీతం అద్భుతంగా ఉందంటూ కామెంట్స్ చేశారు.
డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన ‘మున్నాభాయ్’, ‘త్రీ ఇడియట్స్’, ‘పీకే’ సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి. ఆయనకు చిత్ర పరిశ్రమలోనే ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అలాంటి అభిమాన దర్శకుడి నుంచి ఓ ప్రశంసాపూర్వక సందేశం అందితే ఆ అనుభూతి ఎంత గొప్పగా ఉంటుంది. ఆ గౌరవాన్ని తాజాగా అందుకున్నారు దర్శకుడు సుకుమార్. ఆయన ఇటీవలి సినిమా ‘పుష్ప’ సినిమా బాలీవుడ్ లో సంచలన విజయం సాధించింది. ఈ క్రమంలో ఎంతోమంది అక్కడి ప్రముఖులు దర్శకుడు సుకుమార్ ప్రతిభను మెచ్చుకుంటున్నారు. ఇందులో అరుదైన దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ కూడా చేరారు.
రాజ్ కుమార్ హిరాణీ సందేశంలో …”డియర్ సుకుమార్ ఈ మెసేజ్ మీకు ఎప్పుడో పంపించాల్సింది. ‘పుష్ప’ సినిమా చూసినప్పటి నుంచి మీతో మాట్లాడాలని అనుకుంటున్నా, నా దగ్గర మీ నెంబర్ లేదు. ఒక మిత్రుడు ద్వారా తీసుకున్నా. ‘పుష్ప’ సినిమా గురించి నా మిత్రులతో చాలాసార్లు మాట్లాడాను. ఒక సినిమా గురించి నేను అంతలా మాట్లాడటం వారిని ఆశ్చర్యపరిచి ఉంటుంది. మీ రచన, ప్రతి సన్నివేశాన్ని మలిచిన తీరు, నటీనటుల పర్మార్మెన్స్, సంగీతం ఇలా అన్నీ గొప్పగా ఉన్నాయి. అద్భుతమైన సినిమాను తెరకెక్కించారు. సినిమాను ఆద్యంతం ఆస్వాదించాను. మీరు ముంబై వస్తే ఫోన్ చేయండి. మీట్ అవుదాం”. అని పంపారు.
దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ సందేశానికి ఎంతో సంతోషంగా కృతజ్ఞతలు తెలిపారు దర్శకుడు సుకుమార్. ఆయన స్పందిస్తూ…ఫిల్మ్ మేకింగ్ లో మాస్టర్ లాంటి మీ దగ్గర నుంచి ప్రశంసలు రావడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. రైటింగ్ లో , సినిమా రూపకల్పనలో మీరే నాకు స్ఫూర్తి. మీ మెసేజ్ ను నా స్నేహితులందరికీ పంపిస్తున్నా. అని అన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.