Sonakshi Sinha: హాస్పటల్‌‌కు వెళ్తే ప్రెగ్నెంటేనా..? క్లారిటీ ఇచ్చిన సోనాక్షి సిన్హా

|

Jul 06, 2024 | 7:51 AM

పెళ్లయిన రెండు రోజులకే సోనాక్షి సిన్హా గర్భవతి అని పుకార్లు వచ్చాయి.. పెళ్లి తర్వాత సోనాక్షి సిన్హా హాస్పిటల్‌కి వెళ్లడంతో ఈ రూమర్ వ్యాపించింది. పెళ్లైన వెంటనే భర్తతో కలిసి హాస్పటల్ కు వెళ్ళింది. ఆమె హాస్పటల్ కు వెళ్లే సమయంలో మీడియా కంట్లో పడింది. దాంతో ఆమె ప్రెగ్నెంట్ అనే వార్తలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు దీనిపై సోనాక్షి సిన్హా స్పందించింది.

Sonakshi Sinha: హాస్పటల్‌‌కు వెళ్తే ప్రెగ్నెంటేనా..? క్లారిటీ ఇచ్చిన సోనాక్షి సిన్హా
Sonakshi Sinha
Follow us on

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా వివాహం ఇటీవలే గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే.. తన చిరకాల స్నేహితుడైన జహీర్ ఇక్బాల్‌తో ఆమె వివాహం జరిగింది. పెళ్లయిన రెండు రోజులకే సోనాక్షి సిన్హా గర్భవతి అని పుకార్లు వచ్చాయి.. పెళ్లి తర్వాత సోనాక్షి సిన్హా హాస్పిటల్‌కి వెళ్లడంతో ఈ రూమర్ వ్యాపించింది. పెళ్లైన వెంటనే భర్తతో కలిసి హాస్పటల్ కు వెళ్ళింది. ఆమె హాస్పటల్ కు వెళ్లే సమయంలో మీడియా కంట్లో పడింది. దాంతో ఆమె ప్రెగ్నెంట్ అనే వార్తలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు దీనిపై సోనాక్షి సిన్హా స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం గురించి మాట్లాడారు.

పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉందనే ప్రశ్నకు సోనాక్షి సిన్హా సమాధానం ఇచ్చింది. సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ గత ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కాబట్టి వారు మంచి స్నేహితుల్లా ఉంటారు. దీన్నిబట్టి పెళ్లి తర్వాత జీవితం పెద్దగా మారిపోయిందని సోనాక్షి సిన్హా భావించడం లేదు. ఇప్పుడు ఆమె జీవితం గాసిప్ పరంగానే మారిపోయింది!

‘పెళ్లయ్యాక ఒక్కటే మారిపోయింది.. ఇప్పుడు ఆసుపత్రికి వెళ్లలేకపోతున్నాం. ఆసుపత్రికి వచ్చిన వెంటనే నేను గర్భవతి అని అనుకున్నారు’ అని సోనాక్షి సిన్హా అన్నారు. దీంతో తాజాగా సాగుతున్న గాసిప్‌లపై క్లారిటీ వచ్చింది. ఆమె ఇప్పుడు గర్భవతి కాదని తేలిపోయింది. మొత్తానికి, పెళ్లి తర్వాత సోనాక్షి సిన్హా ఎందుకు ఆసుపత్రికి వెళ్లింది అనేదానికి కూడా సమాధానం వచ్చింది.

సోనాక్షి సిన్హా వివాహం తర్వాత, ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయనను చూసేందుకు సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్‌లు ఆసుపత్రికి వెళ్లారు. అప్పుడు చూసిన చాలా మంది సోనాక్షి సిన్హాని అపార్థం చేసుకున్నారు. సోనాక్షి ప్రెగ్నెంట్ అని, తన భర్తతో కలిసి హాస్పిటల్ కి వచ్చిందని గాసిప్ పుట్టించారు. పెళ్ళికి ముందు శత్రుఘ్న సిన్హా పై క్రేజీ కామెంట్స్ చేశారు. ఆమె పెళ్ళికి పిలిస్తే మేము వెళ్తాము.. ఆమె అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.. కెరీర్ లో ఇప్పుడే సెటిల్ అవుతుంది అని అన్నారు శత్రుఘ్న సిన్హా. కానీ ఆతర్వాత మాట మార్చేశారు .

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.