AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: నాకు తల్లి అయ్యే అదృష్టం లేదు.. సర్జరీ తర్వాత గుక్కపెట్టిన ఏడ్చిన హీరోయిన్..

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్‏కు ఆమె కేరాఫ్ అడ్రస్. అందం, అభినయంతో అప్పట్లో ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. కొన్నాళ్లపాటు సైలెంట్ అయిన బ్యూటీ.. బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొని నానా హంగామా చేసింది. తర్వాత పెళ్లి, విడాకులు అంటూ నిత్యం వార్తలలో నిలిచింది.

Tollywood: నాకు తల్లి అయ్యే అదృష్టం లేదు.. సర్జరీ తర్వాత గుక్కపెట్టిన ఏడ్చిన హీరోయిన్..
Actress
Rajitha Chanti
|

Updated on: Jul 09, 2024 | 3:47 PM

Share

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్‏కు ఆమె కేరాఫ్ అడ్రస్. అందం, అభినయంతో అప్పట్లో ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. కొన్నాళ్లపాటు సైలెంట్ అయిన బ్యూటీ.. బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొని నానా హంగామా చేసింది. తర్వాత పెళ్లి, విడాకులు అంటూ నిత్యం వార్తలలో నిలిచింది. కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని కూడా కోల్పోయింది. ప్రస్తుతం ఆమె తల్లి అయ్యే అవకాశాన్ని కూడా కోల్పోయినట్లు చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ నటి రాఖీ సావంత్. బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్. తన ముక్కుసూటి స్వభావంతో నిత్యం వార్తలలో నిలుస్తుంది. కొన్నాళ్ల క్రితం పెళ్లి, విడాకులు అంటూ తన మాజీ భర్త ఆదిల్ ఖాన్ పై సంచలన కామెంట్స్ చేసింది.

ఇధిలా ఉంటే.. ప్రస్తుతం రాఖీ సావంత్ దుబాయ్ లో ఉంటుంది. కొన్ని రోజులుగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాఖీ సావంత్.. తన జీవితంలోని కష్టమైన విషయాన్ని పంచుకుంది. రాఖీ సావంత్ మాట్లాడుతూ.. ఇటీవల తనకు శస్త్ర చికిత్స జరిగిందని తెలిపింది. మొదట్లో గుండెపోటు అని లక్షణాలను చూసి అన్నారని.. కానీ ఆ తర్వాత వైద్య పరీక్షల అనంతరం ఓ భయంకరమైన విషయం బయటకు వచ్చిందని తెలిపింది. ఆమె గర్భాశయంలో పెద్ద కణితి (10.సెం..మీ) ఉన్నట్లు డాక్టర్స్ గుర్తించారని.. సర్జరీ చేసి ఆ కణతితోపాటు గర్భశయాన్ని తొలగించారని తెలిపింది. ఇక తాను ఎప్పటికీ తల్లిని కాలేనంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

ఇకపై తాను తల్లిని కాలేననే విషయం తెలిసి చాలా బాధపడ్డానని తెలిపింది. ఇకపై తాను తల్లి అయ్యేందుకు సరోగసి మార్గం గురించి ఆలోచిస్తానని తెలిపింది. తాను ఆసుపత్రిలో ఉన్నప్పుడు తనకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సాయం చేశారని చెప్పుకొచ్చింది. తన ఆసుపత్రికి సంబంధించిన బిల్స్ మొత్తానికి డబ్బు అందించాడని.. సల్మాన్ తన ప్రజలను ఎప్పటికీ మర్చిపోడని చెప్పుకొచ్చింది. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడంలో సల్మాన్ ఖాన్ ఎప్పుడూ ముందుంటారని.. ఆసుపత్రిలో తన వైద్య ఖర్చులను పూర్తిగా సాయం చేశాడని తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..