మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మిస్తున్నారు. (Neetu Kapoor) ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. గతంలో చరణ్, శంకర్ సినిమా టైటిల్ పై పలు గాసిప్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొట్టగా.. చరణ్ లుక్స్ నెట్టింట లీక్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
పొలిటికల్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో ఒక కీలకపాత్ర ఉంటుందట.. ఓ పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలి పాత్ర అని తెలుస్తోంది. ఈ రోల్ కోసం బాలీవుడ్ అలనాటి తార స్టార్ హీరో రణబీర్ కపూర్ తల్లి సీనియర్ నటి నీతూ కపూర్ ను సంప్రదిస్తున్నారట మేకర్స్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతుందట.. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయ చేయబోతున్నాడని.. అందులో ఒకటి ప్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్ర కాగా.. మరొకటి ప్రభుత్వోద్యోగి రోల్ అంటున్నారు.. ఈ సినిమాలో సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర, జయరామ్ , అంజలి కీలకపాత్రలలో నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.