ఇద్దరు అంకుల్స్ గలీజ్‌గా నా వీడియోలు తీశారు.. అక్కడ చేతులు వేశారు.. హీరోయిన్‌కు చేదు అనుభవం

సినిమా హీరోయిన్స్ కు చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి.. పబ్లిక్ ప్లేస్ కు వెళ్లిన సమయంలో ఊహించని సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి. అలాగే తాజాగా ఓ హీరోయిన్ కు కూడా అలాంటి అనుభవమే ఎదిరయింది. కొందరు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారని తెలిపింది.

ఇద్దరు అంకుల్స్ గలీజ్‌గా నా వీడియోలు తీశారు.. అక్కడ చేతులు వేశారు.. హీరోయిన్‌కు చేదు అనుభవం
Actres

Updated on: Jan 24, 2026 | 4:27 PM

సినిమా ముద్దుగుమ్మలకు ఎంత ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ అందచందాలతో కుర్రకారును కట్టిపడేస్తూ ఉంటారు పలువురు బ్యూటీలు.. ఇక హీరోయిన్స్ ను అభిమానించే వారు వారిని నేరుగా చూడాలని, కుదిరితే ఫోటో దిగాలని లేదా వారికి షేక్  హ్యాండ్ ఇవ్వాలని ట్రై చేస్తుంటారు. అయితే కొందరు మాత్రం హీరోయిన్స్ విషయంలో అత్యుత్సహం చూపిస్తూ ఉంటారు. హీరోయిన్స్ పబ్లిక్ ప్లేస్ లోకి వస్తే వారి పై ఎగబడటం.. పిచ్చి పిచ్చి తాకడం.. మీదపడిపోవడం చేస్తుంటారు. ఇటీవలే నిధి అగర్వాల్, సమంత లాంటి స్టార్ హీరోయిన్స్ కు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైయ్యాయి. కాగా తాజాగా ఓ నటి కూడా వేధింపుల బారిన పడినట్టు తెలిపింది. కొందరు అంకుల్స్ ఆమెను లో యాంగిల్ లో వీడియోలు తీశారు అంటూ చెప్పుకొచ్చింది ఆ నటి.. ఇంతకూ ఆమె ఎవరంటే..

బాలీవుడ్ అందాల భామ మౌని రాయ్.. ఈ బ్యూటీ మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ పోతుంది. హీరోయిన్ గానే కాదు స్పెషల్ రోల్స్ లోనూ కనిపిస్తూ మెప్పిస్తుంది ఈ చిన్నది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తనకు జరిగిన ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది. ఇద్దరు అంకుల్స్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని తెలిపింది.

ఇటీవల హర్యానాలోని కర్నాల్‌లో జరిగిన ఓ ఫ్యామిలీ ఈవెంట్‌కు హాజరయ్యా.. అక్కడ కొంతమంది నాతో ఫోటో దిగడానికి వచ్చారు. అందులో ఇద్దరి పెద్దమనుషులు నాతో ఫోటో దిగుతూ నా నడుముపై చెయ్యి వేశారు. వారికి తాత వయసు ఉంటుంది. చేతులు తీయండి అని వినయంగా చెప్పా.. ఆతర్వాత డాన్స్ పర్ఫామెన్స్ చేస్తుంటే ఎదురుగా ఇద్దరు అంకుల్ వీడియోలు తీశారు. స్టేజ్ కొంచం హైట్ లో ఉండటంతో.. ఆ అంకుల్స్ లో యాంగిల్ లో వీడియోలు తీస్తూ అసభ్యకరంగా కామెంట్స్ చేశారు. ఛండాలంగా సైగలు చేశారు. అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా వారిని అడ్డుకోలేదు. ఆ సమయంలో అవమానంతో చచ్చిపోయా.. మెంటల్ గా డిస్ట్రబ్ అయ్యా.. నా పరిస్థితే ఇలా ఉంటే ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే అమ్మాయిలను తలుచుకుంటనే భయంగా ఉంది. ఎందుకంత ధైర్యం? మగవాళ్లమన్న అహంకారమా? ఇలాంటివారిని తిట్టేందుకు తిట్లు కూడా రావడం లేదు అంటూ చెప్పుకొచ్చింది మౌని రాయ్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..