Jahnavi Kapoor: విజయ్ దేవరకొండ పిక్ పై శ్రీదేవి డాటర్ షాకింగ్ రియాక్షన్.. జాహ్నవి కపూర్ పోస్ట్ వైరల్..

|

Jul 03, 2022 | 5:36 PM

ఇప్పటికే తమన్నా, నిధి అగర్వాల్, అనుష్క ఈ పిక్‌ ను షేర్ చేస్తూ ట్వీట్ చేయగా.. తాజాగా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. శ్రీదేవీ డాటర్ జాహ్నవి కపూర్ కూడా తన ఇన్ స్టా స్టోరీలో షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది.

Jahnavi Kapoor: విజయ్ దేవరకొండ పిక్ పై శ్రీదేవి డాటర్ షాకింగ్ రియాక్షన్.. జాహ్నవి కపూర్ పోస్ట్ వైరల్..
Jahnavi Vijay
Follow us on

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda).. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో రాబోతున్న లేటేస్ట్ చిత్రం లైగర్ (Liger). బాక్సింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో విజయ్ బాక్సర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మూవీపై అంచనాలను పెంచేశాయి. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తుండగా.. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీని ఆగస్ట్ 25న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో శనివారం ఈ సినిమా నుంచి విజయ్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

విజయ్ డాషింగ్ లుక్ పై  సినీ ప్రముఖులు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. సౌత్ టూ నార్త్ హీరోయిన్స్ విజయ్ లేటేస్ట్ పోస్టర్స్ పై తమదైన శైలీలో రియాక్షన్స్ ఇస్తున్నారు. ఇప్పటికే తమన్నా, నిధి అగర్వాల్, అనుష్క ఈ పిక్‌ ను షేర్ చేస్తూ ట్వీట్ చేయగా.. తాజాగా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. శ్రీదేవీ డాటర్ జాహ్నవి కపూర్ కూడా తన ఇన్ స్టా స్టోరీలో షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

Jahnavi

విజయ్ పోస్టర్ షేర్ చేస్తూ… “బాలీవుడ్ ఇండస్ట్రీలోకి స్పెషల్ హీరో డెలివరీ అయ్యారు.. అతనే విజయ్ దేవరకొండ. త్వరలోనే లైగర్ గా రాబోతున్నాడు ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం జాన్వీ చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇందులో అంతర్జాతీయ బాక్సర్ మైక్ టైసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుండగా.. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.