Tollywood: 40 ఏళ్ల వయసులో పెళ్లిపీటలెక్కనున్న స్టార్ హీరోయిన్! ప్రియుడితో సీక్రెట్ ఎంగేజ్మెంట్!

తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్ వయసు ప్రస్తుతం 40 ఏళ్లు. గతంలో చాలా సార్లు డేటింగ్, రిలేషన్ షిప్ విషయాలతో వార్తల్లో నిలిచిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పెళ్లిపీటలెక్కనుందని టాక్. ఇప్పటికే తన ప్రియుడితో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుందని సమాచారం.

Tollywood: 40 ఏళ్ల వయసులో పెళ్లిపీటలెక్కనున్న స్టార్ హీరోయిన్! ప్రియుడితో సీక్రెట్ ఎంగేజ్మెంట్!
Bollywood Actress Huma Qureshi

Updated on: Sep 16, 2025 | 7:23 PM

మరో ప్రముఖ హీరోయిన్ బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పనుంది. తన మనసుకు నచ్చిన వాడితో కలిసి పెళ్లిపీటలెక్కేందుకు రెడీ అయ్యింది. ఇటీవల పలు సందర్భాల్లో తన ప్రియుడితో కలిసి కనిపించిన అందాల తార ఇప్పుడు అతనితోనే సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారని టాక్. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీరి ప్రేమ వ్యవహారం గురించి వార్తలు వస్తుండడంతో సినీ అభిమానులు, నెటిజన్లు బ్యూటీకి ముందుస్తు విషెస్ చెబుతున్నారు. ఇంతకీ సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకుని సర్ ప్రైజ్ ఇచ్చిన ముద్దుగుమ్మ మరెవరో కాదు రజనీకాంత్ కాలా, అజిత్ వలిమై సినిమాల్లో హీరోయిన్ గా నటించిన హ్యుమా ఖురేషి. తెలుగు, హిందీ, మలయాళం, తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సొగసరి యాక్టింగ్ కోచ్ రచిత్ సింగ్‌తో ప్రేమలో ఉందని తెలుస్తోంది.

గత ఏడాది నుంచి హ్యుమా ఖురేషిరచిత్ కలిసి పలు సినిమా ఈవెంట్లు, ఫంక్షన్లు, పార్టీలకు హాజరవుతున్నారు. మరో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి పెళ్లికి కూడా ఇద్దరూ కలిసే వెళ్లారు. అలాగే ఇటీవల టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌కి కూడా జంటగానే హాజరయ్యారు. అయితే తమ రిలేషన్ గురించి బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండానే ప్రేమ పక్షులు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారని టాక్ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి

బాయ్ ఫ్రెండ్ తో హ్యుమా ఖురేషి డ్యాన్స్..

‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపుర్’ సినిమాలతో హీరోయిన్ గా పరిచయమైంది హ్యుమా ఖురేషి. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన అందాల తార మలయాళంలో వైట్, తమిళంలో అజిత ‘వలిమై’, రజినీకాంత్ ‘కాలా’ చిత్రాల్లోనూ హీరోయిన్‍‌గా చేసింది. ఇక ‘మహారాణి’ వెబ్ సిరీస్‌తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక రచిత్ విషయానికొస్తే ఉత్తరప్రదేశ్ స్వస్థలం. ఢిల్లీ వచ్చి మోడల్ గా కెరీర్ ప్రారంభించాడు. తర్వాత 2016లో ముంబై వచ్చేసి యాక్టింగ్ కోచ్‌గా మారిపోయాడు. ఇప్పుడు సొంతంగా కంపెనీ పెట్టుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.