అనన్య పాండే.. ఈ బాలీవుడ్ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమాతో హీరోయిన్ గా తెలుగులో పరిచయం అయ్యింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఇక ఈ భామ బాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోన్న ఈ బ్యూటీ ఇంట ఇటీవల పెళ్లి బాజాలు మోగాయి. అనన్య కజిన్ అలన్నా పాండే పెళ్లి వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఈ వేడుకల్లో అనన్య పింక్ కలర్ లెహంగాలో మెరిసింది.
అయితే అంతా ఈ వేడుకలో ఎంజాయ్ చేస్తుంటే అనన్య మాత్రం సిగిరెట్ తాగుతూ కనిపించింది. పెళ్లి వేడుకలో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు అందరు ఎంజాయ్ చేస్తుంటే.. అనన్య మాత్రం ఓ సైడ్ కు నిల్చుని స్మోక్ చేస్తూ దర్శనమిచ్చింది.
దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు అనన్య ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అభిమానులు కూడా ఈ అమ్మడు చేసిన పైని పై సీరియస్ అవుతున్నారు. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం, దయచేసి ఆ అలవాటు మానేయ్’ అని కొంతమంది.. ఇంతకాలం అనన్య ఏదో మంచి అమ్మాయి అనుకున్నాం ఇలాంటిదనుకోలేదు అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.