సల్మాన్ ఖాన్‌కు పెళ్లి కాకపోవడానికి ఆమె కారణం.. షాకింగ్ విషయం చెప్పిన బాయ్ జాన్ తండ్రి
సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి నిత్యం ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. సల్మాన్ ఖాన్ జీవితంలోకి చాలా మంది అమ్మాయిలు ఉన్నారు.. సల్మాన్ ఖాన్ లిస్ట్ లో.. సంగీతా బిజ్లానీ, ఐశ్వర్యారాయ్, కత్రినా కైఫ్ లాంటి స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. ఈ స్టార్స్‌తో సల్మాన్ డేటింగ్ చేశాడు. సల్మాన్ ఖాన్ ఓ మహిళ వల్ల లైఫ్ ను కోల్పోయాడని తెలిపారు సల్మాన్ తండ్రి.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ . సినిమాలతో పాటు తన వ్యక్తిగత జీవితంలో ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు. 58 ఏళ్ల వయసులో కూడా సల్మాన్ ఖాన్ ఒంటరిగా జీవిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి నిత్యం ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. సల్మాన్ ఖాన్ జీవితంలోకి చాలా మంది అమ్మాయిలు ఉన్నారు.. సల్మాన్ ఖాన్ లిస్ట్ లో.. సంగీతా బిజ్లానీ, ఐశ్వర్యారాయ్, కత్రినా కైఫ్ లాంటి స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. ఈ స్టార్స్‌తో సల్మాన్ డేటింగ్ చేశాడు. సల్మాన్ ఖాన్ ఓ మహిళ వల్ల లైఫ్ ను కోల్పోయాడని తెలిపారు సల్మాన్ తండ్రి. సల్మాన్ ఖాన్‌కు జరిగిన నష్టానికి తన తల్లి సల్మా ఖాన్ కారణమని సలీం ఖాన్ అన్నారు. ‘సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోలేకపోయాడు ఎందుకంటే సల్మాన్ ఏ అమ్మాయితో డేటింగ్ చేసినా ఆ అమ్మాయిలో తన తల్లిని చూసుకునే వాడు.
”సల్మాన్‌కు చాలా మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ అతను ఎప్పుడూ తన తల్లిని ఆడపిల్లల్లోనే చూసేవాడు. సల్మాన్ ఇలా చేస్తే ఆ అమ్మాయి పారిపోతుంది..తన భార్య తనను తల్లిలా ప్రేమించాలని సల్మాన్ కోరుకున్నాడు.. కానీ అతని సంబంధాలు ఏవీ ఎక్కువ కాలం కొనసాగలేదు.’ ఈ విషయాన్ని సల్మాన్ తండ్రి సలీం ఖాన్ వివరించారు
సల్మాన్ ఖాన్ చాలా మంది నటీమణులతో డేటింగ్ చేశాడు. అందులో మొదటి పేరు నటి సంగీత బిజ్లానీ. సంగీతా బిజ్లానీతో సల్మాన్ ఖాన్ వివాహం కూడా చేసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ వారి వివాహం జరగలేదు. ఆతర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. ఎవరి లైఫ్‌లో వారు బిజీగా ఉన్నారు. నటి ఐశ్వర్యరాయ్‌తో డేటింగ్ చేశాడు. ‘హమ్ దిల్ చుకే సనమ్’ సినిమాలో ఐశ్వర్య-సల్మాన్ తొలిసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ చర్చనీయాంశమైంది. కానీ ఆ సంబంధం ఎక్కువ కాలం నిలవలేదు. చివరకు ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు.. బ్రేకప్ తర్వాత ఐశ్వర్య సల్మాన్ పై చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.