Manoj Bajpayee: పుష్ప 2లో పోలీస్‏గా మనోజ్ బాజ్‏పాయ్.. ఆసక్తికర కామెంట్స్ చేసిన నటుడు..

|

Jul 22, 2022 | 7:23 AM

అలాగే బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పాయ్ సైతం పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని ఇటీవల టాక్ వినిపించింది. తాజాగా ఈ వార్తలపై స్పష్టతనిచ్చాడు మనోజ్.

Manoj Bajpayee: పుష్ప 2లో పోలీస్‏గా మనోజ్ బాజ్‏పాయ్.. ఆసక్తికర కామెంట్స్ చేసిన నటుడు..
Manoj
Follow us on

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప (Pushpa) మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమాకు భారీ వసూళ్లు రాబట్టింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో బన్నీ స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో నటించగా.. ప్రతినాయకుడిగా మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ కనిపించారు. థియేటర్లలో సంచనలం సృష్టించడమే కాకుండా ఓటీటీలోనూ రికార్డ్ క్రియేట్ చేసింది పుష్ప. అలాగే ఇందులోని సాంగ్స్ సైతం నెట్టింటిని షేక్ చేశాయి. ఇక ఇప్పుడు ఆగస్ట్ చివరి వారంలో ఈ పుష్ప 2 రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే పుష్ప 2లో నటించే పాత్రలకు సంబంధించి రోజుకో అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ఇందులో తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పాయ్ సైతం పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని ఇటీవల టాక్ వినిపించింది. తాజాగా ఈ వార్తలపై స్పష్టతనిచ్చాడు మనోజ్.

తన ట్విట్టర్ వేదికగా పుష్ప 2లో తాను నటిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. ఇలాంటి వార్తలు మీకు ఎక్కడెక్కడ లభిస్తాయి ? అంటూ ట్వీట్ చేశారు. అలాగే ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మనోజ్ మాట్లాడుతూ.. పుష్ప 2లో తాను భాగం అవుతున్నట్లు వస్తున్న వార్తలలో నిజం లేదని. అవన్ని అవాస్తవం. ఇంతే చెప్పగలను అని అన్నారు. మొత్తానికి పుష్ప 2లో తాను నటిస్తున్నట్లు వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టేశాడు.

ఇవి కూడా చదవండి

1994లో బాండిట్ క్వీన్ చిత్రంతో సినీ కెరీర్ ఆరభించాడు మనోజ్ బాజ్ పాయ్. ఆ తర్వాత షూల్, పింజర్, రాజనీతి, గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్, అలీఘర్, సోంచిరియా, ఆరక్షన్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. చివరిసారిగా అతను 2021లో వచ్చిన డయల్ 100 చిత్రంలో నటించాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.